Immunity In Kids | సీజన్లు మారినప్పుడు లేదా వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు సహజంగానే ముందుగా చిన్నారులకు దగ్గు, జలుబు, జ్వరం వస్తుంటాయి. రోగ నిరోధక శక్తి వారిలో తక్కువగా ఉంటుంది కనుక ఇలా జరుగుతుంది. దీంతో వారు తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొంటారు. రోగ నిరోధక శక్తి ఇంకా తక్కువ ఉండే చిన్నారులు హాస్పిటల్ పాలు కావల్సి వస్తుంది. అయితే కొన్ని రకాల ఇంటి చిట్కాలను పాటించడం వల్ల వారిలో రోగ నిరోధక శక్తి పెరిగేలా చేయవచ్చు. దీంతో సీజన్లు మారినప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. చలికాలంలోనూ ఈ చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ సీజన్లోనూ చిన్నారులకు తరచూ దగ్గు, జలుబు వస్తుంటాయి. కనుక ఈ చిట్కాలను పాటిస్తే ఉపయోగం ఉంటుంది. మన ఇంట్లో లభించే పదార్థాలతోనే ఆయా చిట్కాలను పాటించడం వల్ల చిన్నారుల్లో సహజసిద్ధంగానే రోగ నిరోధక శక్తిని పెంచవచ్చు. ఇందుకు ఎలాంటి మెడిసిన్లను వాడాల్సిన అవసరం లేదు.
చిన్నారుల ఆరోగ్యానికి పసుపు, తేనె ఎంతో మేలు చేస్తాయి. ఇవి అద్భుతమైన లాభాలను అందిస్తాయి. పసుపు వల్ల రక్త నాళాల వాపులు తగ్గుతాయి. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తేనె కూడా ఈ విషయంలో అద్భుతంగా పనిచేస్తుంది. కనుక ఈ రెండింటినీ కలిపి చిన్నారులకు ఇవ్వాల్సి ఉంటుంది. పావు టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ తేనెను కలిపి చిన్నారులకు రోజూ రాత్రి పూట నిద్రకు ముందు ఇవ్వాల్సి ఉంటుంది. దీని వల్ల రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. అల్లం రసం లేదా కషాయం సేవించడం వల్ల కూడా రోగ నిరోధక శక్తిని పెంచవచ్చు. దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలను తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అర టీస్పూన్ తులసి ఆకుల రసంలో తేనె 5 చుక్కలు, కొద్దిగా అల్లం రసం కలిపి చిన్నారులకు ఇస్తుండాలి. దీన్ని ఉదయం పూట పిల్లలకు తాగించాలి. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
బెల్లాన్ని మనం తరచూ తీపి వంటకాల తయారీలో ఉపయోగిస్తుంటాం. అయితే చిన్నారుల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు బెల్లం అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కనుక బెల్లం చిన్నారులకు ఎంతో మేలు చేస్తుంది. రోజూ చిన్న బెల్లం ముక్కను పిల్లలు తినేలా చూడాలి. దీని వల్ల శక్తి లభించి వారు ఉత్సాహంగా మారడమే కాదు, బద్దకస్తులుగా మారకుండా ఉంటారు. యాక్టివ్‌గా చదువుకుంటారు. అలాగే రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. ఇక వేపాకులు కూడా చిన్నారులకు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లు తగ్గేలా చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. రోజూ ఉదయం పరగడుపునే పిల్లలకు 2 వేపాకులను తినిపిస్తుండడం వల్ల ఉపయోగం ఉంటుంది. వారంలో కనీసం 3 సార్లు అయినా ఇలా చేస్తుంటే ఫలితం ఉంటుంది.
పిల్లలకు రాత్రి పూట పాలలో దాల్చిన చెక్క పొడి లేదా యాలకుల పొడి, లవంగాల పొడి, మిరియాల పొడి, పసుపు వంటివి కలిపి తాగిస్తుండాలి. ఘాటుగా ఉంటాయనుకుంటే కాస్త తేనె కలపవచ్చు. ఇలా చేయడం వల్ల కూడా వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులను తట్టుకునే శక్తి లభిస్తుంది. పిల్లలకు రోజూ ఆహారంలో నెయ్యిని పెట్టాలి. ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి చిన్నారులకు పోషణను అందిస్తాయి. వారిలో ఎదుగుదల సరిగ్గా ఉండేలా చూస్తాయి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్ఫెక్షన్లు తగ్గేలా చేస్తాయి. చిన్నారులకు రోజూ ఒక టీస్పూన్ చ్యవన్‌ప్రాశ్ లేహ్యాన్ని ఇస్తుండడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. ఇది వారి శక్తి సామర్థ్యాలను పెంచుతుంది. రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఇలా ఆయా చిట్కాలను పాటిస్తుంటే చిన్నారుల్లో రోగ నిరోధక శక్తిని సులభంగా పెరిగేలా చేయవచ్చు. దీంతో వారు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు.