HomeHealthFollow These Health Tips And Prevent All Digestive And Gastric Problems
Gastric Problem | సమ్మర్‌లో గ్యాస్ట్రిక్ సమస్యలతో సతమతమవుతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..!
వేసవిలో గ్యాస్ట్రిక్, అసిడిటీ సమస్యలు అధికంగా వేధిస్తుంటాయి. సమ్మర్‌లో తిన్న ఆహారం త్వరగా జీర్ణమవ్వడంతో పాటు జీర్ణాశయంలో మాటిమాటికీ గ్యాస్ ఉత్పన్నమవ్వడమే దీనికి కారణం. అయితే గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటంటే..
2/5
సమ్మర్‌లో డీహైడ్రేషన్ ఎక్కువగా అవుతుంటుంది. కాబట్టి తగిన మోతాదులో నీటిని తాగుతుండాలి. దీనివల్ల జీర్ణాశయంలోని యాసిడ్ లెవల్స్ స్థిరంగా ఉంటాయి. అలా కాకుండా శరీరంలో నీటి శాతం తగ్గితే యాసిడ్ లెవల్స్ తగ్గి గ్యాస్ ఏర్పడే అవకాశం ఉంటుంది.
3/5
భోజనం చేసిన తరువాత కనీసం 30 నిమిషాల పాటు కూర్చుని ఉండాలి. పడుకోకూడదు. లేదంటే గ్యాస్ సమస్యలు వస్తాయి.
4/5
గ్యాస్ సమస్యను తొలగించడంలో అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. గ్యాస్ బాగా ఉంటే అల్లం టీ తాగాలి. లేదా చిన్న అల్లం ముక్కను అలాగే నమిలి మింగాలి. దీంతో గ్యాస్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
5/5
పుదీనా రసం, నిమ్మరసం, బేకింగ్ సోడా నీటి మిశ్రమాలలో దేన్ని తాగినా గ్యాస్ సమస్య నుంచి బయట పడవచ్చు.
6/5
దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులలో ఏదైనా తింటే గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.