పిల్లల్ని గమనిస్తూ ఉండాలిక
వేసవి ఎండల్లో అందరూ డీ హైడ్రేషన్ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయం పెద్దలకే తెలుసు. పిల్లలు తమ సమస్యను గుర్తించలేరు. కాబట్టి పెద్దలే పిల్లలకు వేసవిలో దప్పిక తీరుస్తూ ఉండాలి.
వేసవి ఎండల్లో అందరూ డీ హైడ్రేషన్ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయం పెద్దలకే తెలుసు. పిల్లలు తమ సమస్యను గుర్తించలేరు. కాబట్టి పెద్దలే పిల్లలకు వేసవిలో దప్పిక తీరుస్తూ ఉండాలి. అప్పుడప్పుడూ నీళ్లు తాగుతూ ఉండాలని చెప్పాలి. అయితే, వాళ్లు ఎంత చెప్పినా వినరు. పిల్లలు కదా! కాబట్టి పిల్లలు తాగినామని చెప్పినా ఎండలు తగ్గేదాకా పెద్దలే కాస్త శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలు స్నేహితులతో కలిసి ఆడుకుంటూ దప్పికను మర్చిపోతారు.
తినడం కూడా తగ్గిస్తారు. ఎండలో ఆడుతుంటారు. కాబట్టి శరీరంలోని నీరంతా చెమట రూపంలో బయటికి పోతుంది. దప్పిక అవుతుంది. కానీ ఆటల్లో పడి ఏదీ పట్టించుకోరు. ఇలాంటి సందర్భంలో పిల్లలు నీళ్లు తాగినా అవి వారి శరీరానికి సరిపోతున్నాయో లేదో పెద్దలు గుర్తించాలి. ఇందుకోసం పిల్లల్ని కనిపెట్టుకుంటూ ఉండాలి. కాబట్టి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే శరీరం డీహైడ్రేట్ అవుతున్నట్టే.
దప్పిక వేయడం
- నోరు ఎండిపోతుంది. పెదవులు పొడిబారతాయి.
- అలసిపోయినట్టుగా కనిపిస్తారు.
- అంతకుముందు కంటే తక్కువ ఉత్సాహంతో ఉంటారు.
- ఆట, ఇతర వ్యాపకాల్లో ఆసక్తి తగ్గుతుంది.
- మూత్రం పసుపు రంగులో వస్తుంది.
- తలనొప్పి, తల తిరగడం లాంటి సమస్యలతో ఇబ్బంది పడతారు.
- చర్మం పొడిబారిపోవడం
- ఏడిస్తే కన్నీళ్లు కారకపోవడం
- గుండె వేగంగా కొట్టుకోవడం
- ఊపిరి తీసుకోవడంలో మార్పులు
- దారి మర్చిపోవడం
- ఎక్కువగా, అసాధారణంగా నిద్ర పోవడం
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

