Epilepsy | నాడీవ్యవస్థపై ప్రభావం.. మూర్ఛతో నరకం..
ఇవాళ అంతర్జాతీయ ఎపిలెప్సీ దినోత్సవం
నాడీవ్యవస్థపై ప్రభావం చూపేదే మూర్ఛ వ్యాధి. మెదడులో నియంత్రణ లేకుండా విద్యుత్తు విడుదల కావడం వల్లనే మూర్చ వస్తుంది. ఒక వ్యక్తికి రెండు కన్నా ఎక్కువ సార్లు మూర్చ వస్తేనే ఆ వ్యక్తిని మూర్చ వ్యక్తిగా గుర్తిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 కోట్ల మంది దీని బారిన పడ్డారు. వీరిలో 6 లక్షల మంది భారతదేశంలో ఉన్నారు. మన దేశంలో ప్రతి వేయి మందికి పది మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి.
ఇది తీవ్రమైన మెదడు రుగ్మత. ఏ వయస్సులోనైనా సంభవించవచ్చు. పుట్టకముందే పిల్లల మెదడుకు ఏదైనా నష్టం జరిగినట్లయితే లేదా పుట్టినప్పుడు ఆక్సిజన్ తగ్గిపోయినా మూర్చ వస్తుంది. అలాగే మెదడు గాయపడటంతో కూడా మూర్చ వేధిస్తుంది. మూర్ఛ రావడానికి కారణం మెదడులో సంకోచం లేదా జన్యుపరంగా కూడా కావచ్చు.

అపోహలు.. వాస్తవాలు..
- ఎపిలెప్సీ ఫౌండేషన్ ప్రకారం.. మూర్ఛ అనేది మానసిక వ్యాధి కాదు. దీనితో బాధపడే వారు ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌కు గురవుతారు.
- డబ్ల్యూహెచ్ఓ ప్రకారం, మూర్ఛ అనేది నాన్-కమ్యూనికేబుల్ డిజార్డర్. ఇవాల్టికీ ప్రపంచంలోని 50 శాతం మూర్ఛ రోగులకు కారణమేంటో తెలియదు.
- మూర్ఛ వ్యాధి ఏ వయసు వారిలోనైనా, ఏ జాతి వారిలోనైనా రావచ్చు. జాన్ హాప్కిన్స్ మెడిసిన్ ప్రకారం, ఇది పిల్లలలో తీవ్రమైన ఇబ్బందులను కలిగిస్తుంది. నాడీ వ్యవస్థ అత్యంత సాధారణ రుగ్మతలలో ఒకటిగా చెప్పుకోవచ్చు.
- ఎపిలెప్సీ ఫౌండేషన్ ప్రకారం, ఎపిలెప్టిక్ మూర్ఛలను నివారించడానికి ఎప్పుడూ ప్రయత్నించకూడదు. ఇది రోగికి లేదా మనకు హాని కలిగించవచ్చు. అలాగే, ప్రతీసారి దవాఖానకు వెళ్లాల్సిన అవసరం లేదు.
- మూర్ఛ వ్యాధిని ఎప్పటికీ నయం చేయలేమని చెప్పడం సరికాదు. ప్రస్తుతం దీనికి నివారణ లేదు. కానీ మూర్ఛతో బాధపడుతున్న చాలా మంది వ్యక్తులు ఔషధం ద్వారా నయమవుతారు. పిల్లలు పెద్దయ్యాక మూర్ఛ వ్యాధి నుంచి బయటపడతారు.
ఇవీ జాగ్రత్తలు..
- మూర్చ వ్యాధి వచ్చినప్పుడు చేతిలో ఇనుప వస్తువులు పెట్టడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు.
- ఈ సమయంలో రోగి సౌకర్యవంతంగా పడుకునేలా చేయాలి.
- మెడ వద్ద బిగుతుగా లేకుండా చూడాలి.
- బలవంతంగా పట్టుకోవడం చేయకూడదు.
- దూరప్రాంతాలకు వాహనాలు నడపకుండా చూడాలి.
- మహిళలు పెండ్లిండ్లు చేసుకుని హాయిగా పిల్లల్నికనొచ్చు.
- నిశ్చింతగా ఉద్యోగాలు చేసుకోవచ్చు.
- మూర్చవ్యాధితో బాధపడుతున్నవారు ఒకేసారి పెద్ద వెలుతురు చూడకుండా జాగ్రత్తపడాలి.
- కంటి నిండా నిద్రపోయేలా చూసుకోవాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

