Health News | వంటింట్లో ఉల్లి, వెల్లుల్లి తప్పనిసరిగా ఉంటాయి. దాదాపుగా అన్ని రకాల ఆహారాల్లో వీటిని వాడుతూ ఉంటారు. ఉల్లి, వెల్లుల్లి కలిపితింటే ఏం జరుగుతుంది? ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? దీనికి నిపుణులు చెబుతున్న సమాధానాలు ఇవిగో…
రెండిట్లో పోషకాలు:
ఉల్లి, వెల్లుల్లి కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది. రెండిట్లోనూ యాంటి ఫంగల్, యాంటి బ్యాక్టీరియల్, యాంటి వైరల్ గుణాలు ఉంటాయి. కాబట్టి, వీటిని కలిపి తీసుకోవడం వల్ల మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పదేపదే జబ్బు పడకుండా ఉంటాం.
మైగ్రెయిన్ నుంచి ఉపశమనం:
అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్) ఉన్నవాళ్లు ఉల్లి, వెల్లుల్లిని కలిపి తినాలి. ఇలా చేస్తే కొంతకాలానికి ఈ సమస్య నుంచి విముక్తి లభిస్తుందంటున్నారు నిపుణులు. అంతేకాదు, పార్శపు నొప్పి (మైగ్రెయిన్)తో బాధపడుతున్న వారికి కూడా ఈ రెండు మంచి ఔషధాలుగా పనిచేస్తాయి. అయితే, ఇలా కలిపి తినడానికి ముందు డాక్టర్ సలహా తీసుకుని ఆచరించడం మంచిది.
కొలెస్ట్రాల్‌కు బై బై:
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగినప్పుడు కూడా ఉల్లి, వెల్లుల్లి కలిపి తినడం మంచిది. ఇవి కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తాయి. ఉల్లి, వెల్లుల్లిలో విటమిన్ బి, సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి.