మనలో అధిక శాతం మంది చాలా వేగంగా భోజనం చేస్తుంటారు. అదేమిటని అడిగితే.. పని ఉందనో, ఎక్కడికైనా వెళ్లాలనో.. లేదా తాము అలాగే తింటామనో.. మరే ఇతర కారణమో చెబుతుంటారు. కానీ నిజానికి ఎవరైనా సరే.. భోజనం వేగంగా చేయకూడదు. చాలా నెమ్మదిగా తినాలి. భోజనం తొందరగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఎలాంటి దుష్పరిణామాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.