Apps:
Follow us on:

Summer | సమ్మర్‌లో డీహైడ్రేషన్‌ కాకుండా ఉండేందుకు వీటిని తినండి

1/6వేసవిలో డీహైడ్రేషన్‌ అవ్వకూడదంటే మంచినీళ్లు, కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు, మజ్జిగ తాగాలని చెప్తుంటారు. అయితే, ద్రవాలు మాత్రమే కాదు, కొన్ని రకాల ఘనపదార్థాలు కూడా శరీరంలో వేడిని తగ్గిస్తాయి. వాటిని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే వేసవి తాపం నుంచి ఉపశమనం పొందొచ్చు.
2/6వేడి తగ్గించడంలో సత్తుపిండి విశేషంగా పనిచేస్తుంది. ఉదయం అల్పాహారంగా సత్తుపిండి-మజ్జిగ, సత్తుపిండి-పాలు తీసుకుంటే కడుపు చల్లగా ఉంటుంది. రాత్రిపూట సత్తుపిండి రొట్టెలు తీసుకుంటే మంచిది. జొన్నలు, రాగులతో తయారుచేసే సత్తుపిండి వల్ల శరీరానికి చల్లదనంతోపాటు పోషకాలు కూడా అందుతాయి.
3/6వేసవిలో ఆకుకూరలను రోజూ తినాలి. పాలకూర, తోటకూర, కొత్తిమీర, పుదీనా చలువ చేస్తాయి. ఇవి శరీరానికి అవసరమయ్యే పోషకాలను అందిస్తాయి.
4/6ఆకుకూరలతో పాటు కీరదోస, క్యారెట్‌, బీట్‌రూట్‌లతో సలాడ్స్‌ తీసుకోవాలి. దీనివల్ల కూడా శరీరానికి కావాల్సినంత పోషకాలను అందిస్తాయి.
5/6శరీరంలో వేడిని తగ్గించడంలో పనసపండు బాగా పనిచేస్తుంది. వేసవిలో పనసతొనలతో మిల్క్‌షేక్‌ చేసుకుని తాగొచ్చు. పెరుగు, చక్కెర, పనస పండు గుజ్జుతో చేసిన స్మూతీ కూడా రుచిగా ఉంటుంది. పనసలో ప్రొటీన్లు,కార్బొహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ సమస్యలనూ తగ్గిస్తాయి. దీనిని ‘మాంసానికి ఉత్తమ ప్రత్యామ్నాయ ఆహారం’ అంటారు.
6/6మన దేశంలో చాలాచోట్ల కిళ్లీల్లో ఉపయోగించే గుల్‌కంద్‌ (గులాబీ రేకులను ఉడికించి తయారుచేస్తారు) ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. యునాని వైద్య విధానంలో వేడిని తగ్గించేందుకు గుల్‌కంద్‌ను ఉపయోగిస్తారు. వేడి వల్ల కలిగే మంట, దురదను ఇది దూరం చేస్తుంది.