న్యూఢిల్లీ : చలికాలంలో అడుగుపెడుతున్న క్రమంలో ఈ వాతావరణంలో పలు ఆరోగ్య సమస్యలూ (Health Tips) వెంటాడుతుంటాయి. ఈ సీజన్లో ప్రేవులు, బ్రైన్ హెల్త్‌తో పాటు రోగనిరోధక వ్యవస్ధను కాపాడుకునేందుకు ఆహార నియమాలను అనుసరించాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ సీజన్లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే గుమ్మడికాయతో చేసిన వంటకాలను తినడం మేలు.
గుమ్మడితో జీర్ణక్రియ సజావుగా సాగడంతో పాటు వాపు ప్రక్రియను నివారిస్తుంది. ఫైబర్, విటమిన్స్‌తో నిండిన యాపిల్స్ తీసుకోవడం ద్వారా ప్రేవుల ఆరోగ్యం మెరుగై జీర్ణక్రియ సులువవుతుంది. ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా పెరిగేందుకు ఉపకరిస్తుంది.
ప్రొబయాటిక్స్ అధికంగా ఉండే పెరుగు, మజ్జిగ వంటివి తీసుకోవడం ద్వారా రోగనిరోధక వ్యవస్ధ బలోపేతమై వ్యాధులను దరిచేరనివ్వదు. ఇక వింటర్లో తీసుకోవాల్సిన ఆహార పదార్ధాలను పరిశీలిస్తే..
గుమ్మడికాయ
యాపిల్స్
పెరుగు, మజ్జిగ
వాల్నట్స్
పాలకూర
బెర్రీస్
అల్లం
వెల్లుల్లి
పసుపు
Read More :
Bed bugs | లండన్, పారిస్‌ను హడలెత్తిస్తున్న నల్లులు.. పరుపులను వీధుల్లో పారేస్తున్న జనం