Health Tips | బీట్రూట్ జ్యూస్‌తో అనారోగ్యాలను బీట్ చేద్దామిలా..!
ట్రూట్తో గుండె ఆరోగ్యం మెరుగవుతుందని, జీర్ణక్రియ సాఫీగా సాగుతుందని పలు అధ్యయనాలు వెల్లడించగా తాజాగా బీట్రూట్ జ్యూస్‌తో బ్రెయిన్పవర్ పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది.
న్యూఢిల్లీ : బీట్రూట్తో గుండె ఆరోగ్యం మెరుగవుతుందని, జీర్ణక్రియ సాఫీగా సాగుతుందని పలు అధ్యయనాలు వెల్లడించగా తాజాగా బీట్రూట్ జ్యూస్‌తో బ్రెయిన్పవర్ పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది. వయసు పెరిగే కొద్దీ మెదడు సన్నగిల్లుతుందని వ్యాయామం దీనికి విరుగుడుగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామంతో మెదడుపై సానుకూల న్యూరోప్లాస్టిక్ ఎఫెక్ట్స్ ఉంటాయని పేర్కొన్నారు. బీట్రూట్ జ్యూస్‌తో మెదడుకు రక్తసరఫరా పెరుగుతుందని, వ్యాయామ సామర్ధ్యం మెరుగవుతుందని తాజాగా వెల్లడైంది. బీపీ తగ్గించడంతో పాటు బీట్రూట్తో పలు ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయని ఇటీవల పలు అధ్యయనాలు తెలిపాయి.
బీట్రూట్లో ఉండే నైట్రేట్ బీపీని తగ్గిస్తుందని, మెదడుకు రక్తసరఫరాను పెంచుతుందని ఆయా అధ్యయనాలు వెల్లడించాయి. వ్యాయామానికి ముందు బీట్రూట్ జ్యూస్ తాగితే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చని తాజా పరిశోధన గుర్తించింది. బీట్రూట్ జ్యూస్ తాగి వ్యాయామం చేసిన వయోజనుల్లో 6 వారాల తర్వాత మెదడుపై సానుకూల ఫలితాలను పరిశోధకులు కనుగొన్నారు. వేక్ ఫారెస్ట్ యూనివర్సిటీకి చెందిన సహ రచయిత జాక్ రెజెకి నేతృత్వంలోని పరిశోధకుల బృందం తమ అధ్యయన వివరాలను జర్నల్స్ ఆఫ్ గెరంటాలజీలో ప్రచురించారు. బీట్రూట్ జ్యూస్‌లో ఉండే నైట్రేట్ ద్వారా మెదడుకు ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుందని అధ్యయనంలో గుర్తించారు.
నైట్రిక్ ఆక్సైడ్ చాలా శక్తివంతమైన మాలిక్యుల్ అని, ఆక్సిజన్ అవసరమైన శరీర భాగాలకు ఇది చేరుకుని ఆక్సిజన్‌ను మెరుగుపరుస్తుందని పరిశోధకులు రెజెకి పేర్కొన్నారు. నైట్రేట్ పుష్కలంగా ఉన్న బీట్రూట్ జ్యూస్ రక్తనాళాలను రిలాక్స్ చేసి రక్త సరఫరా సజావుగా సగేలా చేస్తుంది. బీట్రూట్లో నైట్రేట్‌తో పాటు ఫోలేట్, పొటాషియం, విటమిన్ సీ, ఫైబర్ వంటివి మెదడు, కండరాలకు కూడా శక్తినిస్తాయి. బీట్రూట్తో పాటు బీపీని తగ్గించే పండ్లు, కూరగాయలు వంటి పోషకాహారాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ తరహా జీవనశైలిని అలవరుచుకుంటే గుండె ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు మెదడు ఉత్తేజితమవుతుందని పరిశోధకులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- beetroot
- health tips
- new study
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

