Warm Water | ఆరోగ్యంగా ఉండాలంటే మనం రోజూ పౌష్టికాహారం తీసుకోవడం ఎంత అవసరమో రోజూ తగినన్ని నీళ్లను తాగడం కూడా అంతే అవసరం. నీళ్లను తాగడం వల్ల జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడతాయి. దీంతో శరీరంలోని వ్యర్థాలు సులభంగా బయటకు పోతాయి. ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఆయుర్వేద చెబుతున్న ప్రకారం రోజూ మనం గోరు వెచ్చని నీళ్లను తాగాల్సి ఉంటుంది. దీంతో అనేక లాభాలు కలుగుతాయి. రోజంతా గోరు వెచ్చని నీళ్లను తాగడం కష్టం అని భావించే వారు కనీసం ఉదయం పరగడుపున అయినా సరే గోరు వెచ్చని నీళ్లను తాగాల్సి ఉంటుంది. ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. గోరు వెచ్చని నీళ్లను తాగడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. ఈ నీళ్లను తాగితే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. జీర్ణాశయంలో ఎంజైమ్‌ల ఉత్పత్తి సక్రమంగా కొనసాగుతుంది. దీంతో మనం తిన్న ఆహారాన్ని శరీరం సులభంగా జీర్ణం చేస్తుంది. అందులో ఉన్న పోషకాలను కూడా సులభంగా గ్రహిస్తుంది.
గోరు వెచ్చని నీళ్లను ఉదయం పరగడుపునే తాగితే సహజసిద్ధమైన క్లీన్సర్‌లా పనిచేస్తాయి. ఈ నీళ్లను తాగడం వల్ల శరీరంలో ఉన్న టాక్సిన్లు బయటకు పోతాయి. కిడ్నీలు సైతం శుభ్రంగా మారుతాయి. మూత్రం సాఫీగా జారీ అవుతుంది. మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. శరీరంలోని అవయవాలు శుభ్రంగా మారి మెరుగ్గా పనిచేస్తాయి. గోరు వెచ్చని నీళ్లను తాగితే పేగుల్లో మలం కదలికలు సులభతరం అవుతాయి. దీంతో మలబద్దకం తగ్గిపోతుంది. గోరు వెచ్చని నీటి వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో శరీర ఉష్ణోగ్రత తాత్కాలికంగా పెరుగుతుంది. ఇది క్యాలరీలను ఖర్చు చేస్తుంది. వెచ్చ బడ్డ శరీరాన్ని చల్లగా మార్చేందుకు శరీరం క్యాలరీలను ఖర్చు చేయాల్సి వస్తుంది. దీంతో కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. కనుక గోరు వెచ్చని నీళ్లను రోజూ తాగాల్సి ఉంటుంది.
గోరు వెచ్చని నీళ్లను తాగడం వల్ల రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. శరీర భాగాలకు ఆక్సిజన్, పోషకాలు సక్రమంగా సరఫరా అవుతాయి. దీంతో అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. కణాలు నిర్మాణమవుతాయి. కణాలకు మరమ్మత్తులు జరిగి ఆరోగ్యంగా ఉంటాయి. గోరు వెచ్చని నీళ్లను కేవలం ఉదయం మాత్రమే కాకుండా రోజు మొత్తం తాగడం వల్ల ఎంతగానో ఫలితం ఉంటుంది. ముఖ్యంగా అధిక బరువు తగ్గుతారు. స్థూలకాయం ఉన్నవారు గోరు వెచ్చని నీళ్లను తాగుతుంటే మేలు జరుగుతుంది. గోరు వెచ్చని నీళ్లను తాగితే కండరాలు ప్రశాంతంగా మారుతాయి. దీంతో కండరాల నొప్పులు తగ్గిపోతాయి. రాత్రి పూట కాలి పిక్కలు పట్టుకుపోకుండా చూసుకోవచ్చు.
గోరు వెచ్చని నీళ్లను తాగితే మెదడుకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. తలలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ నీళ్లను సేవించడం వల్ల చర్మం సైతం ఆరోగ్యంగా ఉంటాయి. చర్మంలో ఉండే టాక్సిన్లు బయటకు వెళ్లి చర్మం కాంతివంతంగా మారి మృదువుగా ఉంటుంది. యవ్వనంగా కనిపిస్తారు. గొంతు నొప్పి, గొంతులో మంట, గరగర వంటి సమస్యలు ఉన్నవారు గోరు వెచ్చని నీళ్లను తాగుతుండాలి. దీంతో ఎంతో ఉపశమనం లభిస్తుంది. ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. ఇలా గోరు వెచ్చని నీళ్లు మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.