Antibiotics | ప్రతీ చిన్న ఆరోగ్య సమస్యకు మందులు తీసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. అదేవిధంగా వైద్యుల్ని సంప్రదించకుండానే పెద్దలే కాకుండా చిన్నారులకు కూడా యాంటీబయోటిక్స్ ఇస్లున్నారు. ఇది చాలా ప్రమాదకరమని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా మాత్రమే యాంటీబయాటిక్స్ ప్రభావవంతంగా ఉంటాయి. అయితే వానాకాలంలో పిల్లల్లో వచ్చే వివిధ రకాల ఇన్ఫెక్షన్లు వైరల్ అని అభిప్రాయపడుతూ యాంటీబయోటిక్స్ వాడుతున్నారు. ఫలితంగా చిన్నవయసులోనే ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.
ప్రస్తుతం, హెర్పాంగినా, హ్యాండ్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్, డెంగ్యూ, ఫ్లూ, కోవిడ్, వైరల్ డయేరియా, వాంతులు వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు పిల్లలలో 90 శాతానికి పైగా ఇన్ఫెక్షన్లకు కారణమవుతుండగా, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు 10 శాతంగా ఉంటున్నాయి. చిన్నారులు గొంతు నొప్పి అనగానే అజిత్రాల్ వేసుకోమని, లూజ్ మోషన్స్ కాగానే ఓఫ్లోమాక్ మాత్ర తీసుకోమని తల్లిదండ్రులే సూచిస్తుంటారు. ఇవి డయోరియా, వామిటింగ్ వంటి దష్ప్రభావాలకు కారణమవుతున్నాయి. ఇదే సమయంలో మనకు ఉపయోగపడే గట్ బ్యాక్టీరియాను చంపేస్తుందని వైద్యులు చెప్తున్నారు.
నిర్దిష్ట యాంటీవైరల్ మందులు తీవ్రమైన ఫ్లూ, చికెన్‌పాక్స్ వంటి కొన్ని ఇన్ఫెక్షన్లకు మాత్రమే ఉద్దేశించినవి. కొందరు తల్లిదండ్రులు వైద్యులు యాంటీ బయోటిక్స్ ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారని, యాంటీబయోటిక్స్ ఇవ్వాలని తమపై తల్లిదండ్రులే ఒత్తిడి తెస్తున్నారని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. యాంటీబయోటిక్స్‌ను విచ్చలవిడిగా విచక్షణారహితంగా ఉపయోగించడం వల్ల యాంటీబాడీలు నిరోధకానికి గురవుతాయని వారు చెప్తున్నారు. వైద్యులను సంప్రదించకుండానే తల్లిదండ్రులు తమ పిల్లలకు అజీ, జిఫీ, టాక్సిమ్, ఆగ్మెంటిన్, క్లాంప్కిడ్, క్లావామ్, కోపెడెమ్, మోనోసెఫ్, ఆఫ్లాక్స్ ఓజెడ్ వంటి మందులు ఇస్తున్నారు. ఇది మీ చిన్నారుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని గుర్తుంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.