Health tips | ప్రొటీన్ లోపం ఆరోగ్యానికి ఎంత హానికరమో తెలుసా..?
Health tips | ప్రొటీన్ అనేది అత్యంత ముఖ్యమైన స్థూల పోషకం. ప్రోటీన్ కేవలం కండరాల నిర్మాణానికి మాత్రమే తోడ్పడదు. శరీరంలోని ప్రతి కణం, కణజాలం, అవయవాల పనితీరుకు అవసరం.
Health tips : ప్రొటీన్ అనేది అత్యంత ముఖ్యమైన స్థూల పోషకం. ప్రోటీన్ కేవలం కండరాల నిర్మాణానికి మాత్రమే తోడ్పడదు. శరీరంలోని ప్రతి కణం, కణజాలం, అవయవాల పనితీరుకు అవసరం. హార్మోన్లు, ఎంజైమ్‌లు, రోగనిరోధక కణాలు, రవాణా ప్రొటీన్ల ఉత్పత్తిలో ప్రొటీన్ కీలకపాత్ర పోషిస్తుంది. రోజువారీ ఆహారంలో మనం తగినంత ప్రొటీన్ తీసుకోనప్పుడు మన శరీరం వివిధ రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కండరాల బలహీనత
ఈ కండరాల బలహీనత అనేది ప్రోటీన్ లోపానికి అత్యంత స్పష్టమైన సంకేతం. శరీరానికి తగినంత ప్రొటీన్ అందనప్పుడు అది తన కండర కణజాలాలను విచ్ఛిన్నం చేసి అవసరమైన అమైనోఆమ్లాలను పొందుతుంది. దీనివల్ల కండరాల బలం తగ్గి.. బలహీనత, అలసట, రోజువారీ పనులు చేయడంలో ఇబ్బంది లాంటి సమస్యలు కలుగుతాయి. వ్యాయామం చేసినా కండరాలు పెరగకపోవడాన్ని, క్షీణించడాన్ని గమనించవచ్చు.
రోగనిరోధక వ్యవస్థ బలహీనం
మన రోగనిరోధక వ్యవస్థలోని కణాలు, ముఖ్యంగా యాంటీబాడీస్ ప్రొటీన్‌తో తయారవుతాయి. కాబట్టి ప్రొటీన్ లోపం రోగనిరోధక శక్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దానివల్ల శరీరం ఇన్ఫెక్షన్లు, జలుబు, ఫ్లూ తదితర వ్యాధులకు గురవుతుంది. కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టడం, తరచుగా అనారోగ్యాల బారిన పడటం లాంటివి సంభవిస్తాయి.
జుట్టు సమస్యలు
జుట్టు ప్రధానంగా ప్రొటీన్ (కెరాటిన్) తో తయారవుతుంది. ప్రొటీన్ లోపంవల్ల జుట్టు సన్నబడటం, పొడిబారడం, బలహీనపడటం, విపరీతంగా రాలిపోవడం లాంటి సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు జుట్టు రంగు కూడా మారపోయే అవకాశం ఉంది.
చర్మ సమస్యలు
ప్రొటీన్ లోపం చర్మ సమస్యలకు కూడా దారితీస్తుంది. కొల్లాజెన్, ఎలాస్టిన్ అనే ప్రోటీన్లు చర్మం స్థితిస్థాపకతకు, ఆరోగ్యానికి అవసరం. ఈ కొల్లాజెన్, ఎలాస్టిన్ లోపంతో చర్మ సంబంధ సమస్యలు వస్తాయి. చర్మం పొడిగా, పొలుసులుగా మారుతుంది. అదేవిధంగా చర్మంపై పగుళ్లు కూడా వచ్చే ప్రమాదం ఉంది.
గోర్లు పెలుసుబారడం
చేతుల, కాళ్ల గోర్ల ఆరోగ్యానికి కూడా ప్రొటీన్ దోహదపడుతుంది. ప్రొటీన్ లోపంవల్ల గోర్లు పెలుసుగా మారడం, సులభంగా విరిగిపోవడం, గోర్లపై గీతలు ఏర్పడటం లాంటి సమస్యలు వస్తాయి.
ఎడీమా (వాపు)
ఎడీమా శరీరంలో ద్రవ సమతుల్యత లోపంవల్ల వస్తుంది. ప్రొటీన్లు రక్తంలో ప్లాస్మా ఆంకోటిక్ పీడనాన్ని నిర్వహించడంలో సాయపడతాయి. ఈ పీడనం రక్తనాళాల నుంచి కణజాలంలోకి ద్రవం లీక్ అవ్వకుండా నిరోధిస్తుంది. ప్రోటీన్ లోపంవల్ల ఈ పీడనం తగ్గుతుంది. ఫలితంగా ద్రవం కణజాలాలలో పేరుకుపోయి కాళ్లు, చీలమండలు, పాదాలు, చేతుల్లో వాపు వస్తుంది.
బలహీన ఎముకలు
ప్రొటీన్ ఎముకల ఆరోగ్యంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది. ఇది కాల్షియం శోషణ, ఎముకల సాంద్రతకు సాయపడుతుంది. తగినంత ప్రొటీన్ లేకపోతే ఎముకలు బలహీనపడి వాటిలో పగుళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది.
బరువు పెరగడం
ప్రొటీన్ శరీరానికి సంతృప్తిని పెంచుతుంది. ఆకలిని నియంత్రిస్తుంది. ప్రొటీన్ తక్కువగా ఉండే ఆహారం తీసుకున్నప్పుడు ఆకలి ఎక్కువగా ఉంటుంది. దాంతో అతిగా తింటాం. ఫలితంగా బరువు పెరిగే అవకాశం ఉంది.
శక్తి హీనత
ప్రొటీన్ శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. హిమోగ్లోబిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ప్రొటీన్ లోపంవల్ల రక్తహీనత ఏర్పడి తీవ్రమైన అలసట, బలహీనత, తల తిరగడం లాంటి సమస్యలు సంభవిస్తాయి.
ఎంత ప్రోటీన్ అవసరం..?
ఒక సాధారణ ఆరోగ్యవంతుడైన వ్యక్తికి ప్రతి కిలో శరీర బరువుకు 0.8 గ్రాముల ప్రొటీన్ అవసరం. అయితే నిత్యం వ్యాయామం చేసేవారికి, గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు, వృద్ధులకు, కొన్ని అనారోగ్య సమస్యలతో ఉన్నవారికి ప్రొటీన్ అవసరం కొంత ఎక్కువగా ఉంటుంది.
ప్రొటీన్ రిచ్ ఫుడ్స్
మాంసం, చేపలు, గుడ్లు, పాలు, పెరుగు, చీజ్, పప్పులు, బీన్స్, చిక్కుళ్ళు, కాయధాన్యాలు, గింజలు లాంటి వాటిలో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది.
Read More >>
లోక్‌సభలో పదో రోజూ ఆగని ఆందోళనలు.. సోమవారానికి వాయిదా
దేశంలోనే అతిపెద్ద సైబర్ నేరం.. రూ.378 కోట్లు మోసపోయిన కంపెనీ.. రికవరీ చేసినవాళ్లకు భారీ రివార్డు..!
డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందేనట.. ఎందుకో తెలుసా..?
‘ఆ పని మీరు చేస్తే ఒప్పు.. మేం చేస్తే తప్పా?’.. అమెరికాపై చైనా ఫైర్
ప్రముఖ నటి రాధికకు డెంగ్యూ జ్వరం.. నాలుగు రోజులుగా ఆస్పత్రిలోనే
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

