Sleep paralysis | ఇట్లాంటి పరిస్థితి చాలా మందిలోఎదురవుతుంది. మనం నిద్రపోయినపుడు ఛాతిపైన ఏదో ఆకారం కూర్చుని మనకు ఊపిరాడకుండా చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది నిజంగానే దెయ్యమా అంటే.. నూటికి నూరు శాతం తప్పు. ఏఐ యుగంలో కూడా దెయ్యాలేంటండి. ఏ యుగంలోనూ దెయ్యాలు లేవు. అసలు దెయ్యమే లేపుడు ఛాతిపై ఎలా కూర్చుంటుంది?.
ఛాతిపై ఎదో కూర్చున్నట్లు, ఒక ఆకారం మన ఛాతిపై కూర్చుని కదలకుండా గట్టిగా పట్టుకున్నట్లు మనలో చాలా మందికి అనిపిస్తుంది. దాన్ని పక్కకు నెట్టేద్దామన్న కాళ్లు చేతులు ఆడవు. కనీసం తల కూడా అటు ఇటూ కదిలించలేరు. ఎవరినైనా పిలుద్దామన్న నోట మాట రాదు. ఊపిరి కూడా సరిగ్గా ఆడకుండా ఉక్కిరిబిక్కిరిగా అనిపిస్తుంది. రెండు లేదా మూడు నిమిషాల తరువాత మెలకువ రాగానే ఏమీ ఉండదు. పోనీ ఇది కల కూడా కాదు. మరేంటి అంటే..
ఇలాంటి పరిస్థితిని పూర్వం మన పెద్దలు దెయ్యమే అనేవారు. స్వామీజీ వద్దకో, మాంత్రికుని వద్దకో తీసుకెళ్లి తాయెత్తు కట్టించేవారు. కానీ… ఇది నిజంగా దెయ్యం కాదు. దీన్ని వైద్య పరిభాషలో స్లీప్ పెరాలసిస్ అంటారు.
నిద్రలో పక్షవాతం రావడం అన్నమాట. కానీ ఇది ఎక్కువసేపు ఉండదు. జస్ట్ రెండు మూడు నిమిషాలు మాత్రమే ఇలా జరుగుతుంది. నిద్రలో వచ్చే నార్కోలెప్పి అనే వ్యాది ఇది. అంతకు ముందు చాలా రోజుల నుంచి నిద్ర సరిగ్గా పోకపోవడం, ఎక్కువగా అలసిపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాదాపు అందరికీ ఇది నిద్రలోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. మరి దీనికి పరిష్కారం లేదా అంటే ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. మొదటిది కంటినిండా నిద్రపోవాలి. కనీసం 6 నుంచి 8గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. ముఖ్యంగా శారీరకంగా ఎక్కువ కష్టపడే వారు తాము నిద్రపోయే ప్రదేశంలో నిద్ర భంగం కలగకుండా చూసుకోవాలి. మానసిక వత్తిడి, జాబ్ స్ట్రెస్ వంటి సమస్యలు ఉంటే వాటిని దూరం చేసుకుని ప్రతిరోజూ కంటినిండా నిద్రపోతే నిద్రలో వచ్చే పక్షవాతం నుంచి బయటపడొచ్చు.