Warm Water Bath | మనం ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం చేయడం, వేళకు భోజనం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం ఎంత అవసరమో.. శరీరం బాహ్యంగా శుభ్రంగా ఉండాలన్నా కూడా మనం రోజూ స్నానం చేయడం అంతే అవసరం. కానీ కొందరు వాతావరణం చల్లగా ఉంటే స్నానం చేసేందుకు బద్దకిస్తుంటారు. రెండు లేదా మూడు రోజులకు ఒకసారి స్నానం చేస్తుంటారు. కానీ ఇలా చేయకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణం చల్లగా ఉంటే వేడి నీటితో స్నానం చేయాలని, దీంతో అనేక లాభాలను పొందవచ్చని వారు అంటున్నారు. కొందరు నీళ్లను బాగా మరిగించి వేడిగా ఉన్నప్పుడు వాటితో స్నానం చేస్తారు. కొందరు గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తారు. అయితే నీళ్లు మరీ వేడిగా ఉండకూడదు. లేదంటే చర్మంపై నెగెటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల అనేక లాభాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
రోజంతా పనిచేసే వారు, శారీరక శ్రమ చేసేవారు రోజుకు 2 సార్లు స్నానం చేయాలి. ముఖ్యంగా రాత్రి పూట గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. దీంతో ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. నాడీ మండల వ్యవస్థ ప్రశాంతంగా మారుతుంది. దీంతో శరీరంలో ఎండార్ఫిన్లు రిలీజ్ అవుతాయి. వీటిని ఫీల్ గుడ్ హార్మోన్లని అంటారు. ఇవి నాడీ మండల వ్యవస్థను ఉత్తేజం చేస్తాయి. దీంతో నీరసం, అలసట తగ్గుతాయి. ఉత్సాహంగా మారుతారు. తిరిగి చురుగ్గా పనిచేసేందుకు కావల్సిన శక్తి లభిస్తుంది. మైండ్ యాక్టివ్గా మారుతుంది. బద్దకం పోతుంది. ఆందోళన, కంగారు, ఒత్తిడి, కోపం వంటి సమస్యలు ఉన్నవారు గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే ఈ సమస్యలన్నింటి నుంచి ఒకేసారి బయట పడవచ్చు.
గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల కండరాల నొప్పులు, దృఢత్వం తగ్గిపోతాయి. కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. గోరు వెచ్చని నీరు మన చర్మంపై పడగానే రక్త సరఫరా మెరుగు పడుతుంది. కండరాలకు రక్త సరఫరా సరిగ్గా జరుగుతుంది. దీంతో దృఢంగా ఉండే కణజాలం ప్రశాంతంగా మారుతుంది. సాగినట్లు అవుతుంది. దీని వల్ల కండరాల నొప్పులు తగ్గిపోతాయి. పట్టుకుపోయిన కండరాలు తిరిగి వదులు అయి నొప్పి తగ్గుతుంది. కీళ్లు, మోకాళ్ల నొప్పుల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. వ్యాయామం చేసేవారు లేదా శారీరక శ్రమ చేసేవారు, ఆర్థరైటిస్ వంటి నొప్పులు ఉన్నవారు గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. నొప్పులన్నీ తగ్గిపోతాయి.
గోరు వెచ్చని నీటితో రాత్రి పూట స్నానం చేయడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. దీంతో రాత్రి పూట పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచేసరికి ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్గా ఉంటారు. బద్దకం పోతుంది. గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేస్తే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. శరీరంలో ఎక్కడైనా బ్లడ్ క్లాట్స్ వంటివి ఉంటే కరిగిపోతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. దగ్గు, జలుబు, ముక్క దిబ్బడ, ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తుంటే ఉపశమనం లభిస్తుంది. ఆయా సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. ఇలా గోరు వెచ్చని నీటితో స్నానం మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.