డయాబెటిస్ రోగులు లేని వీధి లేదు. దేశంలో రోజు రోజుకూ చక్కెర వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు. దీని నివారణ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి ఇన్సులిన్‌తో జీవితకాలం నెట్టుకురావాల్సిన దుస్థితే. ఇప్పటికి ఇన్సులిన్కి ప్రత్యామ్నాయం లేదు. డయాబెటిస్‌తోపాటు ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారికి మరో చేదువార్త చెప్పారు ఫిన్లాండ్లోని కువోపి యూనివర్సిటీ హాస్పిటల్ వైద్యులు. ఇన్సులిన్ ప్రభావం వల్ల గుండె కవాటాల పనితీరు తగ్గుతుందని వాళ్లు నిర్వహించిన ఓ అధ్యయనంలో గుర్తించారు.
ఇన్సులిన్ ఉపయోగిస్తున్న 45 ఏళ్లు పైబడిన రోగుల గుండె పనితీరుపై వాళ్లు అధ్యయనం చేశారు. ఇన్సులిన్ ప్రభావం వల్ల ధమని కుంచించుకుపోతున్నట్లుగా గమనించారు. ఇలా జరగడం వల్ల ధమని పూర్తిగా తెరుచుకోదు.
అప్పుడు గుండె నుంచి శరీరానికి జరిగే రక్త సరఫరాకు ఆటకం కలుగుతుంది. దీంతో గుండె విఫలమవడం (హార్ట్ ఫెయిల్యూర్) జరగుతుందని, చివరికి ప్రాణహానీ ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య మొదలైనప్పుడు గుండె కొట్టుకోవడం (పంపింగ్) కొంచెం కష్టంగా ఉంటుంది. (అధిక) రక్తపోటు, వికలం చెందిన ధమనులు ఉన్నవాళ్లు డయాబెటిస్ వల్ల ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటే ధమని మూసుకుపోయే ప్రమాదం మరింత తీవ్రంగా ఉంటుందని కూడా ఈ పరిశోధకులు చెబుతున్నారు.