న్యూఢిల్లీ : వేగంగా పెరుగుతున్న మధుమేహ (Diabetes) కేసులు ఆరోగ్యం, ఆహారం పట్ల అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం నొక్కిచెబుతున్నాయి. మధుమేహ కుటుంబ చరిత్ర ఉన్న వారు సైతం డయాబెటిస్ బారినపడకుండా శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.
మధుమేహ ముప్పును తగ్గించేందుకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలని చెబుతున్నారు. జన్యుపరమైన కారణాలతో పాటు ప్రధానంగా అనారోగ్యకర జీవనశైలితో మధుమేహ ముప్పు పొంచిఉంటుంది. మధుమేహం కుటుంబ చరిత్ర కలిగిన వారైతే ఈ రుగ్మత నుంచి తప్పించుకునేందుకు నివారణ చర్యలు తప్పనిసరిగా పాటించాలి.
టైప్ టూ డయాబెటిస్ గుండె జబ్బులు, స్ట్రోక్, అంధత్వం, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి తీవ్ర అనారోగ్యాలకు దారితీసే క్రమంలో దీన్ని నివారించడం, కనీసం దీని బారినపడటాన్ని వాయిదా వేయడంపై దృష్టి సారించాలని న్యూట్రిషనిస్ట్ లీమా మహజన్ సూచిస్తున్నారు. మీ కుటుంబంలో మధుమేహంతో బాధపడేవారుంటే ఈ సూచనలను అనుసరించాలని ఆమె ఇన్స్టాగ్రాం పోస్ట్‌లో రాసుకొచ్చారు.
తగినంత ప్రొటీన్
పరిమితంగా కార్బోహైడ్రేట్స్
యాపిల్ సైడర్ వినెగర్
భోజనాల మధ్య నాలుగైదు గంటల విరామం
వ్యాయామం
Read More :