Dehydration | మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు వ్యాయామం చేయాలన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే రోజూ తగినంత నిద్ర ఉండాలి. తగినన్ని నీళ్లను కూడా తాగాలి. వేళకు భోజనం చేయాలి. అయితే చాలా మంది అన్నీ సరిగ్గానే పాటిస్తారు. కానీ పని ఒత్తిడి వల్ల, తీరిక లేని జీవితం వల్ల నీళ్లను సరిగ్గా తాగరు. కానీ రోజూ నీళ్లను కచ్చితంగా తగిన మోతాదులో తాగాల్సి ఉంటుంది. నీళ్లను సరిగ్గా తాగకపోతే శరీరంలోని అవయవాలకు పోషణ సరిగ్గా లభించదు. దీంతో అనేక వ్యాధులు వస్తాయి. అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. కనుక నీళ్లను తగిన మోతాదులో తాగాల్సి ఉంటుంది. అయితే మనం నీళ్లను సరిగ్గా తాగకపోతే మన శరీరం పలు సంకేతాలను, లక్షణాలను తెలియజేస్తుంది. వాటిని గుర్తించడం ద్వారా మనం నీళ్లను సరిగ్గా తాగడం లేదు అన్న విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చు.
నీళ్లను సరిగ్గా తాగకపోతే డీహైడ్రేషన్ బారిన పడతారు. శరీరంలో ద్రవాల శాతం తగ్గుతుంది. ముఖ్యంగా తలనొప్పి వస్తుంది. మీకు తరచూ తలనొప్పి వస్తుంటే అందుకు ఒత్తిడి, ఆందోళన కారణం కాకపోతే మీరు నీళ్లను సరిగ్గా తాగుతున్నారో లేదో చెక్ చేసుకోండి. నీళ్లను తాగకపోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురై శరీరంలోని ద్రవాలు బయటకు వెళ్లి తలనొప్పి వస్తుంది. కనుక నీళ్లను తగిన మోతాదులో తాగాల్సి ఉంటుంది. దీంతో తలనొప్పి రాకుండా చూసుకోవచ్చు. అలాగే మలబద్దకం సమస్య తరచూ వస్తున్నా కూడా నీళ్లను సరిగ్గా తాగడం లేదని అర్థం. నీటిని తాగకపోతే మలం గట్టిపడి మలబద్దకం ఏర్పడుతుంది. విరేచనం సాఫీగా అవదు. మలబద్దకం ఉన్నవారు నీళ్లను సరిగ్గా తాగుతున్నారో లేదో చెక్ చేసుకోవాలి. నీళ్లను సరిగ్గా తాగకపోతే వాటిని తాగడం అలవాటు చేసుకోవాలి. దీని వల్ల మలబద్దకం తగ్గుతుంది.
నీళ్లను సరిగ్గా తాగకపోతే శరీరంలో రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. దీంతో బీపీ పెరుగుతుంది. మీకు ఉన్నట్టుండి కొన్ని రోజులుగా బీపీ పెరిగినట్లు అనిపిస్తే మీరు నీళ్లను సరిగ్గా తాగుతున్నారో లేదో చెక్ చేసుకోండి. నీళ్లను సరిగ్గా తాగకపోతే తాగండి. దీని వల్ల రక్త సరఫరా మెరుగు పడి బీపీ తగ్గుతుంది. గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. అయితే నీళ్లను సరిగ్గా తాగకపోతే కొందరికి లోబీపీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక బీపీ పెరిగినా లేదా తగ్గినా మీరు నీళ్లను సరిగ్గా తాగుతున్నారా లేదా అనే విషయాన్ని గమనించాలి. దీని వల్ల బీపీ పెరగకుండా, తగ్గకుండా నియంత్రణలో ఉంచుకోవచ్చు. అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
నీళ్లను తగిన మోతాదులో తాగకపోతే మూత్రం ముదురు గోధుమ రంగులో వస్తుంది. కొందరికి పసుపు రంగులో కూడా మూత్రం వస్తుంది. శరీరంలో నీటి శాతం తగ్గితే కండరాలు పట్టుకుపోతాయి. ముఖ్యంగా రాత్రి పూట నిద్రలో కాలి పిక్కలు పట్టుకుంటాయి. కాళ్లు, చేతుల్లో రక్త సరఫరా సరిగ్గా జరగక ఆయా భాగాల్లో తిమ్మిర్లు వస్తుంటాయి. శరీరంలో నీరు తగ్గినా లేదా నీళ్లను సరిగ్గా తాగకపోయినా దాని ప్రభావం చర్మంపై కూడా పడుతుంది. దీంతో చర్మం తేమను కోల్పోయి పొడిగా మారుతుంది. చర్మం సాగినట్లు మారుతుంది. అంద విహీనంగా కనిపిస్తుంది. తగినన్ని నీళ్లను తాగకపోతే రక్త సరఫరా సరిగ్గా లేక కీళ్ల నొప్పులు, వాపులు కూడా వస్తాయి. కనుక ఈ లక్షణాలు, సంకేతాలు కనిపిస్తుంటే కచ్చితంగా నీళ్లను సరిగ్గా తాగడం లేదని అర్థం చేసుకోవాలి. నీళ్లను రోజూ తగినంత మోతాదులో తాగుతుంటే ఈ అనారోగ్య సమస్యలు అన్నీ దూరం అవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు.