మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగినన్ని నీళ్లను తాగాలన్న విషయం అందరికీ తెలిసిందే. ఏ సీజన్ అయినా సరే రోజూ తగినన్ని నీళ్లను తాగితేనే మనం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటాం. చలికాలంలో అయినా కూడా నీళ్లను మోతాదులో తాగాల్సి ఉంటుంది. నీళ్లను సరిపోయినన్ని తాగకపోతే డీహైడ్రేషన్ బారిన పడతారు. ఇంకా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నీళ్లను తగినంతగా తాగకపోతే మన శరీరం మనకు పలు లక్షణాలను తెలియజేస్తుంది. వాటిని పరిశీలించడం ద్వారా మనం నీళ్లను సరిగ్గా తాగడం లేదని అర్థం చేసుకోవచ్చు.
నీళ్లను తగినన్ని తాగకపోతే డీహైడ్రేషన్ బారిన పడతారు. దీని వల్ల జీవక్రియలపై ప్రభావం పడుతుంది. దీంతో కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. జీర్ణశక్తి తగ్గుతుంది. కండరాలు బలహీనంగా మారుతాయి. కండరాలు పట్టుకుపోవడం, సులభంగా దెబ్బలు తగలడం వంటివి జరుగుతాయి. కనుక నీళ్లను తగినంతగా తాగాల్సి ఉంటుంది. డీహైడ్రేషన్ బారిన పడితే చర్మం తన తేమను కోల్పోతుంది. దీంతో చర్మం పొడిబారుతుంది. చర్మంపై పొట్టు లేసతుంది. అలాగే చర్మంపై ముడతలు, గీతలు వస్తుంటాయి. దీంతో చర్మం కాంతిని కోల్పోతుంది. అలాగే చర్మం దురదగా మారుతుంది. అసౌకర్యంగా అనిపిస్తుంది.
నీళ్లను తగినంతగా తాగకపోతే శరీరంలోని కణాలకు పోషకాలు సరిగ్గా లభించవు. అలాగే ఆక్సిజన్ కూడా కణాలకు లభించదు. దీని కారణంగా శరీరంలో శక్తి స్థాయిలు తగ్గిపోతాయి. దీని వల్ల తీవ్రమైన అలసట, నీరసం వస్తాయి. చిన్న పని చేసినా తీవ్రంగా అలసిపోతారు. డీహైడ్రేషన్ వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది తలనొప్పిని కలిగిస్తుంది. దీర్ఘకాలంలో ఇది మైగ్రేన్ గా మారే చాన్స్ ఉంటుంది. డీహైడ్రేషన్ బారిన పడ్డారంటే మూత్రం రంగులోనూ మార్పు వస్తుంది. మూత్రం డార్క్ పసుపు రంగు లేదా గోధుమ రంగులో వస్తుంది. దీన్ని బట్టి మీరు నీళ్లను సరిగ్గా తాగడం లేదని అర్థం చేసుకోవచ్చు. నీళ్లను సరిగ్గా తాగకపోతే మూత్రంలో నీటి శాతం తగ్గి వ్యర్థాల శాతం పెరుగుతుంది. అందుకనే మూత్రం ఆ రంగులో కనిపిస్తుంది. నీళ్లను సరిగ్గా తాగితే మూత్రం లేత పసుపు రంగులో లేదా క్లియర్గా వస్తుంది.
నీళ్లను సరిగ్గా తాగడం వల్ల జీర్ణక్రియ సరిగ్గా నిర్వహించబడుతుఉంది. దీంతో వ్యర్థాలు పేగులలో సులభంగా కదులుతాయి. సరైన మోతాదులో నీళ్లు లేకపోతే మలం పేగుల్లో కదలదు. గట్టిగా మారుతుంది. దీంతో మలబద్దకం వస్తుంది. మన ఉమ్మిలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇది సరిగ్గా ఉత్పత్తి అవకపోతో నోట్లో బాక్టీరియా పేరుకుపోతుంది. దీంతో నోటి దుర్వాసన వస్తుంది. ఇలా గనక లక్షణం కనిపిస్తుంటే మీరు నీళ్లను సరిగ్గా తాగడం లేదని అర్థం చేసుకోవాలి. నీళ్లను సరిగ్గా తాగితే ఉమ్మి ఉత్పత్తి అవుతుంది.
నీళ్లను సరిగ్గా తాగకపోతే డీహైడ్రేషన్ బారిన పడి శరీరంలో ముఖ్యమైన ఎలక్ట్రోలైట్స్ శాతం తగ్గిపోతుంది. ముఖ్యంగా పొటాషియం, సోడియం, మెగ్నిషియం లెవల్స్ తగ్గిపోతాయి. ఇవి కండరాల పనితీరుకు ఎంతో అవసరం. డీహైడ్రేషన్ బారిన పడితే కండరాలు పట్టేస్తుంటాయి. కనుక ఇలా జరుగుతున్నా కూడా నీళ్లను సరిగ్గా తాగడం లేదని అర్థం చేసుకోవాలి. నీళ్లను రోజూ తగిన మోతాదులో తాగితే ఈ సమస్యలన్నీ ఏర్పడకుండా చూసుకోవచ్చు. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.