Dandruff Remedies | జుట్టు ఊడటంతో పాటు చుండ్రు వేధింపులు ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. దుస్తులపై చుండ్రు పడి వికారంగా కనిపిస్తుండటంతో ముఖ్యంగా అమ్మాయిలా చాలా ఇబ్బంది పడుతుంటారు. చుండ్రు సమస్యతో బాధపడే వారు మార్కెట్లో దొరుకుతున్న ఎన్నో షాంపూలను వాడుతున్నా ఫలితం పొందడం లేదు. అనేక బ్రాండ్స్ మార్కెట్లో రిలీజ్ చేస్తున్న వాటితో కృత్రిమ నివారణ చర్యలను పాటిస్తున్నారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కావడం లేదు. ఈ నేపథ్యంలో నేచురల్ టిప్స్ వాడడం వల్ల చుండ్రు సమస్యను నివారించుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.
శరీరంలో ఆయిల్, ఫంగస్ ఎక్కువ కావడం వల్ల డెడ్ స్కిన్ ఏర్పడి చుండ్రు వస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఆయిల్ఫుడ్తగ్గించుకోవాలి. కోల్ థార్ యాసిడ్, సాల్సిలిక్యాసిడ్, జింక్ పైరిథ్రోన్ ఉండేషాంపూలు చుండ్రును తగ్గిస్తాయి. వీటిని మాడుకు పట్టించి 5-10 నిమిషాల సేపు ఉంచి తలస్నానం చేస్తే ఉపశమనం లభిస్తుంది.
జుట్టు ఆరోగ్యాన్ని పెంచే ఆరోగ్యకర, సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. విటమిన్ బీ, జింక్‌ను ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవాలి.
గోరు వెచ్చటి నీటితో తలస్నానం చేయడం అలవర్చుకోవాలి.
గాఢమైన రసాయనాలు కలిసిన హెయిర్ ఆయిల్స్, షాంపూలను ఇష్టం వచ్చినట్లు వాడకూడదు.
జుట్టును నీటితో కడగాలి.. డ్రై షాంపూల జోలికిపొవొద్దు. యాంటీ డాండ్రఫ్ షాంపూలను వాడాలి.
ప్రతిరోజూ నిద్రించే ముందు జుట్టుకు కొబ్బరి నూనె రాసుకొని ఉదయాన్నే షాంపూతో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.
గిన్నెలో నిమ్మరసంతో రసాయనాలు లేని షాంపూ కలిపి తలకు పట్టించాలి. ఇలా 2 వారాలపాటు చేయడం వల్ల సమస్యను దూరం చేసుకోవచ్చు.
పుదీనా రసం మాడుకి పట్టించి అర గంట తర్వాత తలను శుభ్రపరిస్తే చుండ్రు సమస్య ఉండదు.
వేప ఆకులను మెత్తగా నూరి తలకు పట్టించి పావు గంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు తొలగిపోయి తల శుభ్రంగా ఉంటుంది.
పుల్లటి పెరుగును ఉదయాన్నే తలకు పట్టించి అర్ధ గంట తర్వాత తలస్నానం చేయడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు. వారంలో 2 సార్లు ఇలా చేస్తే చుండ్రు సమస్యలు పరిష్కారమవుతాయి.
తలగడ గలీబులను వేడినీటిలో నానబెట్టి, శుభ్రంగా ఉతికి ఎండలో ఆర వేసి వాడటం వల్ల చుండ్రు పెరగకుండా ఉంటుంది.
గమనిక: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.