Colostrum | కొలోస్ట్రమ్ పేరు మనకు అంతగా పరిచయం లేకపోవచ్చు. కానీ, ఆవు ముర్రుపాలు లేదా జున్నుపాలనే ఇంగ్లిష్లో కొలోస్ట్రమ్ అంటారు. దూడకు జన్మనిచ్చిన తర్వాత ఆవు పొదుగు నుంచి కొన్ని రోజులపాటు విడుదలయ్యే ముర్రుపాలను ‘ద్రవరూప బంగారం’ (లిక్విడ్ గోల్డ్)గా భావిస్తారు. ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, యాంటిబాడీస్ పుష్కలంగా ఉండే ఆవు ముర్రుపాలు మన శరీర కణాల మరమ్మతు, గాయాలు మాన్పడం, రోగ నిరోధక వ్యవస్థ, పొట్ట ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయని వివిధ అధ్యయనాల్లో వెల్లడైంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ముర్రుపాలను భారతదేశంలో వేల సంవత్సరాల కిందటే ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించారు. వీటిపై శాస్త్రీయ అధ్యయనం 1799లో క్రిస్టఫ్ విల్హెల్మ్ హూఫ్లాండ్ నిర్వహించాడు. మన ఆరోగ్యానికి అండగా నిలిచే ఆవు ముర్రుపాలు ఇప్పుడు పొడి, ట్యాబ్లెట్ల రూపంలో సప్లిమెంట్లుగా దొరుకుతున్నాయి. వీటి మేలు గురించి తెలుసుకుందాం.