Rice Water | పూర్వకాలంలో మన పెద్దలు అన్నం వండేటప్పుడు గంజిని వార్చేవారు కాదు. ఒకవేళ గంజిని వార్చినప్పటికీ అందులో కాస్త ఉప్పు, కారం కలిపి సూప్‌లా తాగేవారు. దీంతో అనేక పోషకాలు లభించి ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ఇప్పుడు చాలా మంది గంజిని వంపేస్తున్నారు. మిగిలిన చెత్తను తింటున్నారు. దీంతో పోషకాలు అసలు లభించడం లేదు. అయితే వాస్తవానికి మనకు గంజి అనేక లాభాలను అందిస్తుంది. అన్నం వండేటప్పుడు గంజిని పారబోయకుండా అందులో కాస్త ఉప్పు, కారం కలిపి తాగితే ఎంతో రుచిగా ఉండడమే కాదు, అనేక పోషకాలను కూడా పొందవచ్చు. గంజిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
గంజిలో కార్బొహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల దీన్ని తాగితే శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. శారీరక శ్రమ చేసేవారు, వ్యాయామం చేసిన వారు గంజిని తాగితే త్వరగా శక్తి లభిస్తుంది. దీంతో మళ్లీ యాక్టివ్‌గా మారుతారు. ఉత్సాహంగా పనిచేస్తారు. పలు రకాల జీర్ణ సమస్యలకు కూడా గంజి దివ్యౌషధంలా పనిచేస్తుంది. విరేచనాల, అజీర్తి సమస్యలు ఉన్నవారు గంజిని తాగుతుంటే సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. జీర్ణాశయం, పేగులకు గంజి ఎంతో మేలు చేస్తుంది. పొట్టలో ఉండే అసౌకర్యాన్ని గంజి తగ్గిస్తుంది. దీంతో విరేచనాల నుంచి బయట పడవచ్చు. అలాగే పేగుల్లో మలం కదలిక సరిగ్గా ఉంటుంది. దీంతో గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
వేసవి కాలంలో గంజి తాగితే శరీరానికి ఎంతో చలువ చేస్తుంది. గంజిని చల్లని నీటిలో కలిపి తాగవచ్చు. లేదా ఫ్రిజ్‌లో పెట్టుకుని తాగవచ్చు. గంజిని తాగడం వల్ల శరీరం చల్లగా మారుతుంది. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది. శరీరంలోని వేడి మొత్తం పోతుంది. ఎండ కారణంగా శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్‌ను గంజి బ్యాలెన్స్ చేస్తుంది. దీంతో ఉత్సాహం వస్తుంది. చురుగ్గా ఉంటారు. అలాగే జ్వరం వచ్చిన వారు గంజిని తాగుతుంటే శక్తి లభించి త్వరగా కోలుకుంటారు. జ్వరం నుంచి విముక్తి పొందవచ్చు.
గంజిలో అనేక బి విటమిన్లు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్లు బి1, బి2, బి6 సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర మెటబాలిజంను మెరుగు పరుస్తాయి. మెదడు పనితీరు మెరుగు పడుతుంది. యాక్టివ్‌గా ఉంటారు. బద్దకం పోతుంది. గంజిలో ఉండే మెగ్నిషియం, పొటాషియం గుండెకు, కండరాలకు ఎంతో మేలు చేస్తాయి. ఆయా భాగాల నొప్పులు, వాపుల నుంచి బయట పడవచ్చు. రాత్రి పూట కాలి పిక్కలు పట్టుకుపోకుండా ఉంటాయి. గంజిలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి. చర్మంపై ఉండే దద్దుర్లతోపాటు దురదను తగ్గిస్తాయి. చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో గంజి సహాయ పడుతుంది. గంజి నీటిని తరచూ శిరోజాలకు అప్లై చేస్తుంటే శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. కాంతివంతంగా మారి ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి. ఇలా గంజితో మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు.