Chickpea | పప్పు దాన్యాల పెద్దన్న
శనగలు పప్పు దినుసులలో పెద్దన్నలాంటివి. వీటిది 7,500 ఏండ్ల ఆహార చరిత్ర. ప్రపంచమంతటా విస్తృతంగా వినియోగంలో ఉన్నాయి.
శనగలు పప్పు దినుసులలో పెద్దన్నలాంటివి. వీటిది 7,500 ఏండ్ల ఆహార చరిత్ర. ప్రపంచమంతటా విస్తృతంగా వినియోగంలో ఉన్నాయి. వీటిలో దేశి (బెంగాల్‌గ్రామ్ లేదా కాలాచనా), కాబూలీ (తెల్ల శనగలు లేదా నైలాన్ శనగలు) అని రెండు రకాలు. ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, ఫైబర్‌తో సమృద్ధమైన శనగలు శక్తి భాండాగారాలు.
రకరకాలుగా..
వారంలో మూడుసార్లు ఉడికించిన శనగలు తినాలి. మామూలువి, కాబూలీ రకానివి మార్చిమార్చి ప్రయత్నించవచ్చు. అన్నం, చపాతీలకు శనగల కూర గొప్ప జోడీ. చోలే చావల్ అంటే అందరికీ నోరూరుతుంది. సలాడ్లు, సూపుల్లో కూడా శనగలు కలుపుకోవచ్చు. ఆలివ్ నూనె చిలకరించి వేయించుకుని ఆరగించవచ్చు. మొలకెత్తిన శనగల నుంచి పోషకాలు అపారంగా అందుతాయి.
గుండెకు అండ
ఫైబర్ అధికం కాబట్టి, గుప్పెడన్ని శనగలు తింటే చాలాసేపటి వరకు కడుపు నిండిన అనుభూతి ఉంటుంది. ఒక్కసారి శనగలు తిన్నామంటే ఆ తర్వాత ఇతర ఆహార పదార్థాల మీదికి అంత తొందరగా మనసు మళ్లదు. వీటిలోని ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గిస్తుంది. అలా గుండె ఆరోగ్యానికి శనగలు చాలామంచివి. ఈ విషయంలో కాబూలీ శనగల కంటే మామూలువే మెరుగ్గా ఉంటాయి. ఫైబర్ ఎక్కువ, రక్తంలో చక్కెర స్థాయులు పెంచే ైగ్లెసిమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి మామూలు శనగలు మధుమేహం ఉన్నవాళ్లకూ మంచివే.
యాంటీఆక్సిడెంట్స్ నిధులు
విటమిన్-సి, ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్లతో సమృద్ధమైన శనగల్లో ఫైటోన్యూట్రియెంట్లు కూడా ఎక్కువే. ఒక కప్పు శనగల్లో దాదాపు 40 మిల్లీగ్రాముల మాంగనీస్ ఉంటుంది. రోజువారీ మాంగనీస్ అవసరాల్లో ఇది సగం. ఈ విషయంలోనూ మామూలు శనగలే ముందుంటాయి. ఇంకా… నిద్రలేమితో బాధపడే వారికి శనగలు మంచి నిద్రకు భరోసా ఇస్తాయి.
స్త్రీల నేస్తం
శనగల్లో ఉండే ఫైటో ఈస్ట్రోజెన్స్ ఆస్టియోపోరోసిస్ (ఎముకలు గుల్లబారడం), రొమ్ము క్యాన్సర్ నుంచి రక్షణను ఇస్తాయి. మనం శనగలు తిన్న తర్వాత వీటిలో ఉండే ఫైబర్ పొట్టలో కిణ్వ ప్రక్రియకు గురవుతుంది. బ్యూటీరేట్ అనే ఫ్యాటీ యాసిడ్‌గా మారుతుంది. క్యాన్సర్ కణాలు తమంతట తామే విచ్ఛిన్నం అయ్యేందుకు ఈ బ్యూటిరేట్ దోహదపడుతుంది. ఈ రకంగా శనగలు క్యాన్సర్ నుంచి మనల్ని కాపాడతాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరెంట్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
Rahul Gandhi | ఇండియా బ్లాక్ పార్టీలకు హైటీ ఏర్పాటు చేసిన రాహుల్.. సీఈసీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన పోరుపై చర్చ
Aishwarya | ‘మీరు ఎంతమందిని చంపుతున్నారు.. ఐశ్వర్య మృతికి కారణం డాక్టర్ల నిర్లక్ష్యమే’
రిటర్నింగ్ వాల్ మూసివేతపై డీజీఎం సివిల్ రాజేంద్ర కుమార్ విచారణ
SA vs AUS | జగజ్జేతకు ఆసీస్ ఝలక్.. సొంతగడ్డపై సఫారీలకు తొలి ఓటమి..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

