Chia Seeds Vs Sabja Seeds | చియా గింజలకు, సబ్జా గింజలకు తేడా ఏమిటి.. ఏవి ఎక్కువ మేలు చేస్తాయి..?
ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లపై చాలామంది ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటారు. అందులో భాగంగా సబ్జా గింజలు, చియా గింజలు వేసిన పానీయాలను వేసవిలో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే నీటిలో నానబెట్టిన తర్వాత ఈ రెండు గింజలు ఒకేలా కనిపించినప్పటికీ శరీరంపై చూపే ప్రభావం మాత్రం భిన్నంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Chia Seeds Vs Sabja Seeds | ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లపై చాలామంది ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటారు. అందులో భాగంగా సబ్జా గింజలు, చియా గింజలు వేసిన పానీయాలను వేసవిలో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే నీటిలో నానబెట్టిన తర్వాత ఈ రెండు గింజలు ఒకేలా కనిపించినప్పటికీ శరీరంపై చూపే ప్రభావం మాత్రం భిన్నంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడంలో ఏవి ఎక్కువ ఉపయోగపడతాయనే విషయంపై వారు వివరాలను వెల్లడిస్తున్నారు.
తేడాలేంటి..
సబ్జా గింజలు తులసి జాతికి చెందిన స్వీట్ బాసిల్ మొక్క నుంచి లభిస్తాయి. వీటిని చాలాకాలంగా ఫలూదా, షర్బత్ వంటి వేసవి పానీయాల్లో ఉపయోగిస్తున్నారు. నీటిలో వేసిన కొన్ని నిమిషాల్లోనే ఇవి విస్తరించి జెల్లా మారిపోతాయి. చియా గింజలు మాత్రం సాల్వియా మొక్క నుంచి వస్తాయి. వీటిని సాధారణంగా స్మూతీలు, హెల్త్ డ్రింక్స్, పుడ్డింగ్స్లో ఉపయోగిస్తారు. చియా గింజలు కూడా నీటిని పీల్చుకుని జెల్లా మారతాయి కానీ పూర్తిగా నానేందుకు ఎక్కువ సమయం పడుతుంది. శరీరాన్ని చల్లబరచడంలో సబ్జా గింజలు ఎక్కువగా ఉపయోగపడతాయని సంప్రదాయ వైద్య విధానాలు చెబుతున్నాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం బాసిల్లో ఉండే బయో యాక్టివ్ సమ్మేళనాలు శరీర వేడిని తగ్గించడంలో, జీర్ణక్రియను ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి. అందుకే వేసవిలో నిమ్మరసం, రోజ్ షర్బత్, కొబ్బరి నీటిలో సబ్జా గింజలను కలిపి తీసుకునే అలవాటు ఉంటుంది. అలాగే చియా గింజలు మాత్రం నేరుగా శరీరాన్ని చల్లబరచడంలో కాకుండా పోషక విలువల కోసం ఎక్కువగా గుర్తింపు పొందాయి. వీటిలో ఫైబర్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ, గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ మెరుగుదలకు ఇవి సహాయపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి.
నానబెట్టాకే తినాలి..
హైడ్రేషన్ విషయంలో రెండు గింజలూ ఉపయోగకరమే అయినప్పటికీ సబ్జా గింజలు జీర్ణాశయానికి తేలికగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి అధిక ఆమ్లత్వం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. సబ్జా గింజలు తమ బరువుకంటే దాదాపు 15 రెట్లు ఎక్కువ నీటిని నిల్వ చేసుకోగలవు. చియా గింజల్లో ఫైబర్ అధికంగా ఉండటంతో అవి ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉంచుతాయి. అయితే సరైన విధంగా నానబెట్టకుండా తీసుకుంటే వేసవిలో కొందరికి కడుపు భారంగా అనిపించే అవకాశం ఉంటుంది. పోషక విలువల పరంగా చూస్తే చియా గింజలు ముందుంటాయి. వీటిలో ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. శక్తిని ఎక్కువసేపు నిల్వ ఉంచడంలో, తృప్తి భావాన్ని కలిగించడంలో ఇవి ఉపయోగపడతాయి. సబ్జా గింజల్లో ప్రోటీన్ తక్కువగా ఉన్నప్పటికీ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.
వేసవిలో అయితే ఇవి మేలు..
వేసవిలో సబ్జా గింజలను నిమ్మరసం, రోజ్ మిల్క్, కొబ్బరి నీరు వంటి తేలికపాటి పానీయాల్లో కలిపి తీసుకోవడం మంచిది. ఇవి 10 నుంచి 15 నిమిషాల్లోనే నానిపోతాయి. చియా గింజలను మాత్రం ఓవర్‌నైట్ డ్రింక్స్, స్మూతీలు, బ్రేక్‌ఫాస్ట్ బౌల్స్‌లో ఉపయోగిస్తే మంచిది. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం ప్రధాన లక్ష్యమైతే సబ్జా గింజలు మంచి ఎంపిక అని చెప్పవచ్చు. పోషక విలువలు, ఫైబర్, ఎక్కువసేపు శక్తి కావాలనుకుంటే చియా గింజలు మెరుగైనవి అని చెప్పవచ్చు. అయితే ఈ రెండింటినీ అవసరానికి అనుగుణంగా వేసవి ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
Obsession | రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి రాబోతున్న ‘అబ్సెషన్ అన్‌కట్ వెర్షన్’
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్‌కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

