సిద్ధ విధానంలో తయారుచేసిన ఓ ఔషధ మిశ్రమం కౌమార వయసు అమ్మాయిల్లో రక్తహీనతను (ఎనీమియా) తగ్గిస్తుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. అన్నపేటిసెంటురం, బావన కటుక్కాయ్, మాతులై మాణప్పకు, నెల్లికాయ్ లేకియం (ఎబీఎంఎన్) అనే ఔషధ మిశ్రమం రక్తహీనతతో బాధపడుతున్న కౌమార బాలికల్లో హిమోగ్లోబిన్ స్థాయులు పెరిగేలా చేయగలదని ఆ అధ్యయనం తెలిపింది.
ఈ మిశ్రమం ఎనీమియాకు సంబంధించిన లక్షణాలైన అలసట, జుట్టు రాలడం, తలనొప్పి, నిరాసక్తిగా ఉండటం, నెలసరి సమస్యలను గణనీయంగా తగ్గించిందని, హిమోగ్లోబిన్ స్థాయులను, రక్తానికి సంబంధించిన ఇతర గుణాలను మెరుగుపర్చిందని ఆ అధ్యయనం పేర్కొన్నది.
కాబట్టి రక్తహీనత గురించి కౌమార వయసు అమ్మాయిల్లో అవగాహన పెంచడంతోపాటు పోషకాహారం, సమస్య నివారణ చర్యలు తీసుకోవడంతోబాటు సిద్ధ ఔషధాల చికిత్స ప్రయోజనం గురించి కూడా తెలియజేయాలని సిద్ధ విధాన వైద్యులు సూచిస్తున్నారు. ఈ అధ్యయనాన్ని 2,648 మంది అమ్మాయిల మీద నిర్వహించారు. వీరిలో 2,300 మంది 45 రోజుల కోర్సు పూర్తిచేయడం గమనార్హం.