Health Tips | కొన్నిసార్లు మూత్రంలో నురగ సాధారణ విషయమే. అయితే, తరచుగా వస్తుంటే మాత్రం దాన్ని ఆరోగ్య సమస్య సంకేతంగా భావించాలి. మూత్రం రంగులో మార్పు, మంట, నురగ వంటివి ఎన్నో రోగాలకు సంకేతాలు. వీటిని నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి.
ప్రొటీన్లు అధికంగా: కిడ్నీల్లో సమస్యల కారణంగా మూత్రంలో ప్రొటీన్లు కలిసిపోతాయి. దీంతో మూత్రం నురగగా వస్తుంది.
కిడ్నీ సమస్యలు: కిడ్నీలు సరిగ్గా పనిచేయనప్పుడు కూడా మూత్రంలో నురగ వస్తుంది.
డయాబెటిస్: మధుమేహ రోగుల్లో రక్తంలో చక్కెర స్థాయులు అధికంగా ఉండటం కూడా మూత్రంలో నురగకు కారణం. రక్తంలో చక్కెర స్థాయులు పెరిగినప్పుడు మూత్రంలో నురగ ఏర్పడుతుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్ (యూటీఐ), ప్రొస్టేట్ సమస్యలు కూడా మూత్రంలో నురగకు దారితీస్తాయి.
మూత్ర పరీక్ష: మూత్రంలో ప్రొటీన్లు, గ్లూకోజ్, ఇతర మూలకాలు ఉంటే ఈ పరీక్ష అవసరమవుతుంది.
రక్త పరీక్ష: కిడ్నీ పనితీరు గురించి తెలుసుకోవడానికి అవసరం.
మైక్రో ఆల్బుమిన్ పరీక్ష: మూత్రంలో ప్రొటీన్ల పరిమాణాన్ని తెలుసుకోవడానికి చేస్తారు.
అల్ట్రాసౌండ్ పరీక్ష: కిడ్నీలు, మూత్రనాళ స్థితిగతులను పరీక్షించడానికి దీన్ని చేస్తారు.
మూత్రంలో నురగ తరచుగా వస్తూ… మూత్రం గాఢమైన పసుపురంగులో, ఎర్రగా, అసాధారణంగా అనిపిస్తే డాక్టర్ను కలవాలి. మూత్ర విసర్జన సమయంలో మంటగా, నొప్పిగా, లేదంటే కిడ్నీల్లో అసౌకర్యంగా అనిపించినా, శరీరంలో వాపు కనిపించినా డాక్టర్ను కలవాలి.