Kiss and Cavities | జలుబు, ఫ్లూ, స్ట్రెప్ థ్రోట్.. ఇవన్నీ అంటువ్యాధులే. ఎవరైనా మనకు దగ్గరగా దగ్గడం, తుమ్మడం గానీ చేసినప్పుడు వారి నోటి నుంచి సూక్ష్మక్రిములు మనకు చేరే అవకాశాలు ఉంటాయి. ఇలాంటప్పుడు మనం దూరం జరుగుతాం. ఫలితంగా మనకు అంటువ్యాధులను కలిగించే సూక్ష్మక్రిములు చేరవు. ఎక్కువగా చక్కెర ఉండే ఆహారాలు తినడం వల్ల, షుగర్ ఉండే పానీయాలు తాగడం వల్ల, శరీరం నుంచి వచ్చే ద్రవాల వల్ల డెంటల్ క్యావిటీస్ కనిపిస్తుంటాయి. మరి, క్యావిటీస్ అంటువ్యాధి అయితే, మనం ఎవరినైనా ముద్దు పెట్టుకోవడం వల్ల క్యావిటీస్ వస్తుందా? అని మనం ఆశ్చర్యపోవచ్చు.
మన నోరు దాదాపు 700 రకాల బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మక్రిములకు నిలయం అని మనలో ఎంత మందికి తెలుసు. ఈ సూక్ష్మక్రిములు మన లాలాజలంలో, దంతాలు, నాలుక, దవడలు, ఇతర నోటి లోపలి భాగాలపై ఉంటాయి. మన లాలాజలం మంచి, చెడు బ్యాక్టీరియాల సమతుల్యతను నిర్వహిస్తుంది. అయితే, కొన్ని రకాలు వివిధ కారణాల వల్ల కాలక్రమేణా మరింత సమృద్ధిగా, హానికరంగా మారుతుంటాయి. డెంటల్ క్యావిటీస్ మనం ముద్దు పెట్టుకోవడం ద్వారా సంభవించవు. ముద్దు మన నోటిలోకి అనేక హానికరమైన బ్యాక్టీరియాలు చేర్చడం ద్వారా ఈ సమస్య వచ్చేందుకు కారణమవుతుంది.
పోర్ఫిరోమోనాస్ గింగివాలిస్, స్ట్రెప్టోకోకస్ మ్యూటాన్స్ వంటి బ్యాక్టీరియా అంత మంచివి కావు. ఇవి మన దంతాలపై క్యావిటీస్ కలిగిస్తాయి. అందుకని ఎవరినైనా ముద్దుపెట్టుకునేటప్పుడు ఈ బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి చేరి క్యావిటీలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి ముద్దు పెట్టుకోవడం ద్వారా దంతాల మీద క్యావిటీస్ ఏర్పడతాయని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. పూర్ ఓరల్ హెల్త్ సమస్యలతో బాధపడుతున్న సందర్భాల్లో ఇది మరీ ప్రత్యేకంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి.
ముద్దు పెట్టుకునే సమయంలో నోటి నుంచి ఎదుటి వారి నోట్లోకి లాలాజలం పోకుండా చూడాలి. పెదవులపై ముద్దులకే పరిమితం కావాలి. పార్ట్నర్ నోట్లో నాలుక పెట్టకూడదు. చిన్నారులకు ఆహారాన్ని నోటితో నమిలి ముద్దగా చేసి తినిపించకూడదు. చిన్నారుల నోట్లో నాలుక పెట్టి ఆడుకోకూడదు. క్యావిటీస్కు గురిచేసే బ్యాక్టీరియా ఒకరి నుంచి మనలోకి ప్రవేశించినట్లుగా దంతవైద్యులు కూడా రొటీన్ పరీక్షల్లో కనిపెట్టలేరు. క్యావిటీస్ వచ్చిన తర్వాతనే ఆ బ్యాక్టీరియాను గుర్తించొచ్చు. సురక్షితంగా ఉండేందుకు ముద్దులు పెట్టుకున్న తర్వాత, లాలాజలం నోట్లోకి వెళ్లినట్లు భావించే సందర్భాల్లో నోటిని యాంటీసెప్టెక్ మౌత్ వాషర్తో శుభ్రం చేసుకోవాలి. నిత్యం రెండుసార్లు బ్రషింగ్ చేసుకోవడం, ఫ్లాసింగ్ వల్ల క్యావిటీస్ సమస్య రాకుండా చూసుకోవచ్చు.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.