Jackfruit | పండ్లు అనగానే మనకు తియ్యని రుచి గుర్తుకు వస్తుంది. కానీ అన్ని రకాల పండ్లు తియ్యగా ఉండవు. కేవలం కొన్ని మాత్రమే తియ్యగా ఉంటాయి. అయినప్పటికీ పండు ఏదైనా సరే ఆరోగ్య ప్రయోజనాలనే అందిస్తుంది. అయితే తియ్యని పండ్లలో పనస పండ్లు కూడా ఒకటి. వీటి వాసన అతి తీపిగా ఉంటుంది. కనుక ఈ పండ్లను తినేందుకు కొందరు వెనుకాడుతుంటారు. కానీ పనస పండ్లను తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ప్రపంచ వ్యాప్తంగా పనస పండ్లను చాలా మంది తింటుంటారు. కొందరు ఈ పండ్లను చక్కెరకు ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగిస్తారు. ఈ పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనకు అనేక లాభాలను అందిస్తాయి. పనస పండ్లను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
పనస పండ్లలో అనేక రకాల విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఈ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లా కూడా పనిచేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. ఈ పండ్లలో విటమిన్ ఎ సమృద్ధిగా లభిస్తుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పండ్లలో అధికంగా ఉండే పొటాషియం, మెగ్నిషియం, మాంగనీస్ మన శరీరంలో అనేక జీవకక్రియలు సక్రమంగా నిర్వహించబడేందుకు దోహదం చేస్తాయి. పనస పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్దకం తగ్గేలా చేస్తుంది. ఫైబర్ వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీని వల్ల ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది.
పనస పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది బీపీని నియంత్రిస్తుంది. ఈ పండ్లలో సమృద్ధిగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లతోపాటు ఫైబర్ వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. పనస పండ్లలో ఉండే విటమిన్ సి వల్ల తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. దీని వల్ల శరీరం ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండేలా చూస్తుంది. రోగాలు రాకుండా ఉంటాయి. పనస పండ్లు తియ్యగా ఉంటాయి. అయినప్పటికీ వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. పైగా ఫైబర్, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కనుక ఈ పండ్లను తింటే షుగర్ లెవల్స్ పెరగవు. షుగర్ నియంత్రణలో ఉంటుంది. కనుక డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు.
పనస పండ్లలో ఉండే ఫ్లేవనాయిడ్స్, లిగ్నన్స్ అనే సమ్మేళనాల కారణంగా ఈ పండ్లు యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను సైతం కలిగి ఉంటాయి. ఇవి శరీరంలోని తీవ్రమైన వాపులను సైతం తగ్గిస్తాయి. దీని వల్ల ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. ఈ పండ్లలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కనుక నాన్ వెజ్ తినని వారికి వీటిని చక్కని ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. పనస పండ్లతో కొందరు ఊరగాయ, చట్నీ, కూరలు కూడా చేస్తుంటారు. నాన్ వెజ్ తినని వారు ఇలా పండ్లను తింటున్నా కూడా మేలు జరుగుతుంది. దీని వల్ల ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. కండరాల నిర్మాణం జరుగుతుంది. శరీరానికి శక్తి లభించి ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. నీరసం, అలసట ఉండవు. పనస పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు విటమిన్ సి అధికంగా ఉంటుంది కనుక ఈ పండ్లను తింటే చర్మం సురక్షితంగా ఉంటుంది. సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల బారి నుంచి చర్మానికి రక్షణ లభిస్తుంది. ఇలా పనస పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు.