Breast Cancer | చికిత్స అవసరం లేకుండానే ఇలా రొమ్ము కేన్సర్ నివారించవచ్చు
Breast Cancer | నడివయసు దగ్గరపడుతున్న కొద్దీ రొమ్ము క్యాన్సర్ ముప్పు కూడా దగ్గరవుతూ వస్తుంది. ఆధునిక వైద్య విధానాల పుణ్యమాని, ఈ రుగ్మతకు సమర్థవంతమైన చికిత్స అందుబాటులోకి వచ్చింది. కాకపోతే అదో ఖరీదైన వ్యవహారం. చికిత్స వరకూ వెళ్లాల్సిన అవసరం లేకుండా.. ముందు జాగ్రత్తలతోనే రొమ్ము క్యాన్సర్‌కు ముకుతాడు వేయవచ్చు. ముఖ్యంగా జీవనశైలి మార్పులు రక్షణ కవచంలా నిలుస్తాయి. ఒక్క రొమ్ము క్యాన్సర్ అనే కాదు హృద్రోగాలు, మధుమేహం వంటి అనేకానేక వ్యాధులను అడ్డుకోగల శక్తి ఆరోగ్యవంతమైన జీవనశైలికి ఉంది.

మద్యానికి దూరం
రొమ్ము క్యాన్సర్‌కు తొలి శత్రువు మద్యం. ఇటీవలి కాలంలో స్త్రీలలోనూ మద్యం వినియోగం పెరుగుతున్నది. వైద్య ప్రపంచానికి తీవ్ర ఆందోళన కలిగిస్తున్న పరిణామం ఇది. దీనివల్ల దీర్ఘకాలంలో వివిధ క్యాన్సర్లు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి, మద్యానికి సాధ్యమైనంత దూరంగా ఉండాలి. ధూమపానం జోలికి అసలే పోవద్దు.
ఆరోగ్యకరమైన బరువు
ఊబకాయం ఉన్నవారికి రొమ్ము క్యాన్సర్ ముప్పు ఎక్కువ. ఆరోగ్యకరమైన బరువుతో క్యాన్సర్ ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఈ విషయంలో ఆహార నిపుణుల సలహాలు, సూచనలు పాటించడం మంచిది.
చురుకుదనం
పరిపూర్ణ ఆరోగ్యవంతులు రోజుకు అరగంట చొప్పున, వారంలో 150 నిమిషాలపాటు
మితంగా ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి. ఇది ఆరోగ్యకరమైన
బరువు కొనసాగించడానికి దోహదపడుతుంది. రొమ్ము క్యాన్సర్ సహా వివిధ ఆరోగ్య సమస్యల ముప్పునూ తగ్గిస్తుంది.

అమ్మపాలు
రొమ్ము క్యాన్సర్‌ను తగ్గించడంలో అమ్మపాలదీ కీలకపాత్రే. తల్లి తన పిల్లలకు ఎంత ఎక్కువ కాలం చనుబాలిస్తే, అంత ఆరోగ్య సంరక్షణ లభిస్తుంది.
మెనోపాజ్ అనంతరం
మెనోపాజ్ తర్వాత హార్మోన్ చికిత్సలు పరిమితంగా చేయించుకోవాలి. కొన్ని రకాలైన హార్మోన్ చికిత్సల వల్ల రొమ్ము క్యాన్సర్ ముప్పు పెరిగే ప్రమాదమూ ఉంది.
ఆరోగ్యకరమైన ఆహారం
పోషకాహారం వల్ల కొన్నిరకాలైన క్యాన్సర్లతోపాటు మధుమేహం, గుండె రోగాలు, పక్షవాతం ముప్పు తగ్గుతుంది. అందులోనూ సమతుల ఆహారం ఎంతో మంచిది. కానీ, మనం సంప్రదాయ భోజనాన్ని చిన్నచూపు చూస్తాం. కనీసం ఇప్పటి నుంచి అయినా పాతకాలపు ఆహారానికి పళ్లెంలో స్థానం ఇవ్వాలి. రెడ్ మీట్, అధిక చక్కెరలు, కొవ్వులను దరిచేరనీయవద్దు.
గర్భ నిరోధక మాత్రల వినియోగం
గర్భ నిరోధక మాత్రల వాడకం వల్ల, హార్మోన్ల ద్వారా గర్భ విచ్ఛిత్తి కారణంగా కూడా రొమ్ము క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. ఈ విషయంలో గైనకాలజిస్టులతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకోవాలి.
ఇవి కాకుండా… రొమ్ము క్యాన్సర్ ప్రాథమిక లక్షణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొత్తగా వాపు కనిపించినా, చర్మంలో మార్పులు వచ్చినట్టు అనిపించినా డాక్టర్ల దృష్టికి తీసుకెళ్లాలి. నలభై ఏండ్లకు ముందు నుంచే స్త్రీలు ప్రతీ ఏడాది మమోగ్రఫీ చేయించుకోవాలి. దీనివల్ల క్యాన్సర్‌ను తొలి
దశలోనే గుర్తించవచ్చు. ప్రభావవంతమైన చికిత్స ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.
– డాక్టర్ నిఖిల్ ఎస్. ఘడ్యాల పాటిల్,
మెడికల్ ఆంకాలజిస్ట్ & హెమటో ఆంకాలజిస్ట్
యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
Breast Cancer : మహిళల్లో రొమ్ము క్యాన్సర్ నివారణకు చిట్కాలు
ఈ ఉత్పత్తులతో.. బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు!
రొమ్ము క్యాన్సర్‌కు విటమిన్-డి
క్యాన్సర్ అమ్మతనానికి అడ్డు కాదు!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

