Brain Stroke | మన జీవనశైలే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మన అలవాట్లే మనకు ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. మారుతున్న జీవనశైలి, అలవాట్లతో పాటు ఒత్తిడికి గురై బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతున్నారు. దీన్నే పక్షవాతం అని కూడా అంటారు. స్ట్రోక్‌కు గురైన వారికి సకాలంలో చికిత్స అందించడం ద్వారా మరణించే అవకాశాలు తక్కువగా ఉంటాయని వైద్యులు సెలవిస్తున్నారు. ఒత్తిడి, ఆందోళన, ఆర్థిక ఇబ్బందులు.. ఇలా వివిధ కారణాలకు ముందుగా ప్రభావితమయ్యేది మెదడు. మెదడు పనితీరు మందగిస్తుంటే ముప్పు వాటిల్లనున్నట్లు గ్రహించాలి.
మెదడు కణాలకు ఆక్సిజన్ అవసరం. ఈ ఆక్సిజన్ రక్తం ద్వారా అందుతుంది. మెదడు కణాలకు రక్తం సరఫరా నిలిచిపోవడంతో వచ్చే ప్రమాదమే బ్రెయిన్ స్ట్రోక్. ఈ వ్యాధిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్నది. పక్షవాతం సమస్యలను ముందే పసిగడితే ప్రమాదం నుంచి ప్రాణాలను కాపాడుకోవచ్చు.
ఇంగ్లిష్ FAST అక్షరాలతో ఈ సమస్యను గుర్తించవచ్చు.
F – అంటే ముఖం (ఫేస్).. ముఖంలో మార్పులు కనిపిస్తాయి. ముఖం ఒక వైపునకు వంగిపోతుంది.
A – అంటే భుజం (ఆర్మ్).. ఒక వైపున చేయి, పాదం భాగంలో తిమ్మిరి కనిపిస్తుంది. బలహీనంగా మారి కదలిక సాధ్యం కాదు
S – అంటే మాట (స్పీచ్).. మాట్లాడటంలో ఇబ్బంది, అస్పష్టంగా భాష నోటి నుంచి వెలువడుతుంది. సమాధానం కూడా చెప్పలేరు.
T – అంటే సమయం (టైమ్).. పై లక్షణాలు కనిపించగానే సరైన సమయంలో వైద్యుడిని సంప్రదించాలి.
నెల ముందే ఇలా కనిపెట్టొచ్చు..
బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి నెల రోజుల ముందు నుంచే లక్షణాలను పసిగ్గటడం ద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. ముఖ్యంగా ముఖం, కాళ్లు, చేతులు ఒక వైపు మాత్రమే మొద్దుబారుతాయి. కంటి చూపులో తేడా వస్తుంది. శ్వాసలో మార్పులు కనిపిస్తాయి. ఛాతీలో నొప్పి కనిపిస్తుంది. ఛాతీలో ఎక్కువగా నొప్పి వచ్చిందంటే స్ట్రోక్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో వెంటనే వైద్యులను సంప్రదించి తగు చికిత్స పొందాలి.
మహిళల్లో కనిపించే మార్పులు ..
బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యే మహిళల్లో తల వెనక భాగంలో విపరీతంగా నొప్పి కనిపిస్తుంది. కొన్నిసార్లు స్పృహ కోల్పోతుంటారు. స్త్రీల ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. ఉన్నట్టుండి విషయాలు మర్చిపోతారు. వికారం, వాంతులు వస్తాయి. భ్రమ పడుతున్నట్లు కూడా అనిపిస్తుంది.
మరికొన్ని కారణాలు..
నివారణామార్గాలు ఇవి..
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.