Brahmi Plant | మన చుట్టూ ప్రకృతిలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. కానీ అలాంటి మొక్కల గురించి చాలా మందికి తెలియదు. ఆయుర్వేదంలో ఈ మొక్కలను విరివిగా ఉపయోగిస్తుంటారు. అనేక ఔషధాల తయారీలోనూ వాడుతుంటారు. అలాంటి మొక్కల్లో బ్రహ్మి మొక్క కూడా ఒకటి. ఇది మన చుట్టూ పరిసరాల్లోనే పెరుగుతుంది. కానీ చాలా మందికి ఈ మొక్క ఎలా ఉంటుందో తెలియదు. ఈ మొక్క ఆకులు గుండ్రంగా మందంగా ఉంటాయి. వీటిని చూస్తే సులభంగా గుర్తు పట్టవచ్చు. ఈ క్రమంలోనే ఈ మొక్క ఆకులను అనేక ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అలాగే ఈ ఆకుల రసం పలు వ్యాధులను నయం చేయడంలో పనిచేస్తుంది. బ్రాహ్మి మొక్క ఆకుల రసాన్ని సేవిస్తుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. బ్రాహ్మి మొక్క మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుందని వారు అంటున్నారు.
బ్రాహ్మి మొక్కను హిందీలో గోటు కోలా అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం సెంటెల్లా ఏషియాటికా. ఆయుర్వేదంతోపాటు చైనా సంప్రదాయ వైద్యంలోనూ ఈ మొక్కను విరివిగా ఉపయోగిస్తారు. అనేక శక్తివంతమైన గుణాలు ఈ మొక్క ఆకుల్లో ఉంటాయి. రోజువారి ఆహారంలో ఈ మొక్క ఆకులను కూడా చేర్చుకోవాలి. దీంతో అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు. బ్రాహ్మి ఆకుల రసాన్ని సేవిస్తుంటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు పనితీరు మెరుగు పడుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. మతిమరుపు తగ్గుతుంది. మానసిక సమస్యలు ఉన్నవారికి లేదా ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు ఉన్నవారికి ఈ మొక్క ఆకుల రసాన్ని ఇస్తుంటే ఫలితం ఉంటుంది. ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
బ్రాహ్మి మొక్క ఆకుల్లో చర్మాన్ని సంరక్షించే గుణాలు ఉన్నాయి. ఈ మొక్క ఆకుల రసం మన శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో చర్మం సాగే గుణాన్ని పొందుతుంది. దీని వల్ల చర్మంపై ఉండే గీతలు, ముడతలు, మచ్చలు పోతాయి. ఎగ్జిమా వంటి చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బ్రాహ్మి ఆకుల రసాన్ని సేవిస్తుంటే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. రక్తనాళాల్లోని అడ్డంకులు తొలగిపోతాయి. ముఖ్యంగా వెరికోస్ వీన్స్ సమస్య ఉన్నవారికి ఉపశమనం కలుగుతుంది. రక్తనాళాలు వాపులకు గురి కాకుండా ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
బ్రాహ్మి ఆకుల్లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి తీవ్రమైన వాపులను సైతం తగ్గిస్తాయి. దీంతో కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారికి మేలు జరుగుతుంది. ఈ మొక్క ఆకుల రసం సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్ లా పనిచేస్తుంది. దీంతో ఎలాంటి నొప్పులు, వాపులు అయినా సరే తగ్గిపోతాయి. ఈ మొక్క ఆకుల్లో అడాప్టొజెన్ గుణాలు ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో మూడ్ మారుతుంది. ఉత్సాహంగా ఉంటారు. ఆందోళన, కంగారు తగ్గిపోతాయి. మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. బ్రాహ్మి ఆకుల రసాన్ని సేవిస్తుంటే శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది కాలిన గాయాలు, పుండ్లను త్వరగా తగ్గేలా చేస్తుంది. ఇలా బ్రాహ్మి మొక్క ఆకులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. కనుక ఈ మొక్క మీకు కనిపిస్తే విడిచిపెట్టకుండా ఇంటికి తెచ్చుకోండి. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.