Bitter Gourd | డయాబెటిస్ ఉన్నవారికి కాకరకాయలు చేసే మేలు అంతా ఇంతా కాదు..!
కాకరకాయలు అంటే సహజంగానే చాలా మందికి ఇష్టం ఉండవు. వీటిని తినేందుకు అందరూ అయిష్టతను ప్రదర్శిస్తుంటారు. కాకరకాయలతో మనం తరచూ పలు రకాల వంటలను చేస్తుంటాం.
Bitter Gourd | కాకరకాయలు అంటే సహజంగానే చాలా మందికి ఇష్టం ఉండవు. వీటిని తినేందుకు అందరూ అయిష్టతను ప్రదర్శిస్తుంటారు. కాకరకాయలతో మనం తరచూ పలు రకాల వంటలను చేస్తుంటాం. వేపుడు, టమాటాలతో కలిపి వండుకోవడ లేదా పులుసు పెట్టుకోవడం చేస్తుంటాం. అయితే వాస్తవానికి డయాబెటిస్ ఉన్నవారికి కాకరకాయ చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. షుగర్ ఉన్నవారు కచ్చితంగా రోజూ కాకరకాయలను తినాల్సి ఉంటుంది. అయితే వీటిని తినడం ఇష్టం లేకపోతే కనీసం జ్యూస్ రూపంలో అయినా తాగాలి. దీంతో అనేక లాభాలను పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. కాకరకాయ డయాబెటిస్‌ను అదుపు చేయడంలో అద్భుతంగా పనిచేస్తుందని వారు అంటున్నారు.
షుగర్ లెవల్స్ తగ్గుతాయి..
కాకరకాయల్లో చరాంతిన్ అనే సహజసిద్ధమైన స్టెరాయిడ్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. కాకరకాయల్లో ఓలినాలిక్ యాసిడ్ గ్లూకోసైట్స్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. క్లోమగ్రంథి ఇన్సులిన్‌ను సరిగ్గా ఉత్పత్తి చేసేలా చేస్తాయి. దీని వల్ల రక్తంలో ఉన్న షుగర్ లెవల్స్ తగ్గుతాయి. కనుక కాకరకాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు తప్పనిసరిగా రోజూ వీటిని తింటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. కాకరకాయ జ్యూస్‌ను రోజూ 30 ఎంఎల్ మోతాదులో తాగినా చాలు షుగర్ లెవల్స్‌ను అదుపు చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. రక్తంలో ఉన్న అధిక చక్కెర స్థాయిలను మాత్రమే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలోనూ కాకరకాయలు అద్భుతంగా పనిచేస్తాయి.
అధిక కొలెస్ట్రాల్‌కు..
అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్న వారు రోజూ కాకరకాయను తింటుంటే ఫలితం ఉంటుంది. శరీరంలో ఉండే ఎల్డీఎల్ (చెడు కొలెస్ట్రాల్) తగ్గిపోతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీని వల్ల గుండె పనితీరు మెరుగు పడుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా కాపాడుకోవచ్చు. కాకరకాయల్లో అనేక రకాల బి కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఉంటాయి. ఈ విటమిన్ల లోపంతో బాధపడుతున్నవారు రోజూ కాకరకాయ జ్యూస్‌ను తాగితే ఫలితం ఉంటుంది. ఈ జ్యూస్‌ను తాగడం వల్ల కిడ్నీలు క్లీన్ అవుతాయి. కిడ్నీల్లో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. దీని వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే కిడ్నీల్లో ఉండే స్టోన్స్ కరిగిపోతాయి. మూత్రాశయ ఇన్ఫెక్షన్ల నుంచి బయట పడవచ్చు.
లివర్ సమస్యలకు..
లివర్ సమస్యలు ఉన్నవారు రోజూ కాకరకాయను తినడం లేదా దాని జ్యూస్‌ను తాగడం చేస్తే ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల లివర్‌లోని వ్యర్థాలు బయటకు పోతాయి. లివర్ పనితీరు మెరుగు పడుతుంది. ముఖ్యంగా లివర్‌లో ఉండే కొవ్వు కరుగుతుంది. కాకరకాయ జ్యూస్‌ను సేవించడం వల్ల జీర్ణ వ్యవస్థ క్లీన్ అయి పనితీరు మెరుగు పడుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు ఉండవు. అందువల్ల కాకరకాయలను తరచూ తింటుండాలి. చేదుగా ఉన్నాయని వీటిని పక్కన పెడితే మీరు అనేక లాభాలను కోల్పోతారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Bitter Gourd
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | వైసీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. అధికారంలోకి రావడం ఖాయం, అప్పుతో కలసి చెల్లిస్తాం
Share Market | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 413 పాయింట్లు లాభం
Narnia | | హాలీవుడ్ విజువల్ ఫీస్ట్ ‘నార్నియా’ ట్రైలర్ వచ్చేసింది.!
Meerut | భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణశిక్ష.. హత్య చేసి పాముకాటుగా నమ్మించిన భార్య
School Shooting: అమెరికా స్కూల్లో కాల్పుల ఘటన.. ముగ్గురు చిన్నారులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

