Saif Ali khan | రాత్రి 10 దాటితే కరీనా కపూర్ మౌనం.. ఏం జరిగిందో తెలియక తికమకపడిన సైఫ్ అలీ ఖాన్!
Saif Ali khan | బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ముఖ్యంగా కరీనా పాటించే ఓ ప్రత్యేక అలవాటు గురించి సైఫ్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రాత్రి 10 గంటలు దాటితే కరీనా పూర్తిగా మౌనంగా ఉండిపోతుందని, మొదట్లో ఆమె ప్రవర్తన అర్థం కాక తాను అయోమయానికి గురయ్యేవాడినని సైఫ్ సరదాగా వెల్లడించారు.
Saif Ali khan | బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ముఖ్యంగా కరీనా పాటించే ఓ ప్రత్యేక అలవాటు గురించి సైఫ్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రాత్రి 10 గంటలు దాటితే కరీనా పూర్తిగా మౌనంగా ఉండిపోతుందని, మొదట్లో ఆమె ప్రవర్తన అర్థం కాక తాను అయోమయానికి గురయ్యేవాడినని సైఫ్ సరదాగా వెల్లడించారు.ఇటీవల ‘కాఫీ విత్ కరణ్’ తొమ్మిదో సీజన్లో ఈ జంట పాల్గొని సందడి చేసింది. దాదాపు 16 ఏళ్ల విరామం తర్వాత సైఫ్, కరీనా కలిసి ఈ ప్రముఖ సెలబ్రిటీ చాట్ షోలో కనిపించడం విశేషం. గతంలో 2010లో మూడో సీజన్లోనూ వీరిద్దరూ జంటగా పాల్గొన్నారు. ఇలా ఈ షోలో రెండుసార్లు కలిసి కనిపించిన అరుదైన జంటగా ప్రత్యేక గుర్తింపు పొందారు.
ఈ కార్యక్రమంలో కరణ్ జోహార్‌తో ముచ్చటించిన సైఫ్.. కరీనా రాత్రి 10 గంటల నిబంధన గురించి వివరించారు. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత పడకగదిలోకి వెళ్లాక కరీనా ఎవరితోనూ మాట్లాడదని చెప్పారు. మొదట్లో ఈ అలవాటు గురించి తనకు తెలియకపోవడంతో ఆమె అకస్మాత్తుగా మౌనంగా ఉండిపోతే ఏం జరిగిందో అర్థం కాక కంగారు పడేవాడినని తెలిపారు. తాను ఏమైనా తప్పు చేశానా? ఆమె ఎందుకు మాట్లాడటం లేదని ఆలోచించేవాడినని నవ్వుతూ చెప్పారు. అది కరీనా తన కోసం కేటాయించుకున్న వ్యక్తిగత విశ్రాంతి సమయమని అర్థం చేసుకోవడానికి తనకు కొన్ని సంవత్సరాలు పట్టిందని వెల్లడించారు.
సైఫ్ వ్యాఖ్యలపై కరీనా కూడా సరదాగా స్పందించారు. రాత్రి 10 గంటల తర్వాత మాట్లాడకుండా ఉండటాన్ని తన వ్యక్తిగత విశ్రాంతి సమయంగా అభివర్ణించారు. అయితే రాత్రి వేళ మౌనంగా ఉండే కరీనా ఉదయం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుందని సైఫ్ చెప్పారు. నిద్రలేచిన వెంటనే ఎంతో ఉత్సాహంగా ఉంటుందని, ఫోన్లో మాట్లాడుతూ తన దగ్గరకు వచ్చి ఎన్నో విషయాలు చెబుతుందని అన్నారు. దీనికి కరీనా స్పందిస్తూ.. బాలీవుడ్లో రోజంతా జరిగిన విశేషాలు, గాసిప్స్ చెబుతుంటే సైఫ్ మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోరని నవ్వుతూ వ్యాఖ్యానించారు.ఇక వ్యక్తిగత జీవితంలో సైఫ్, కరీనా 2012లో వివాహం చేసుకున్నారు. వీరికి తైమూర్, జెహ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వయస్సులో వ్యత్యాసం ఉన్నప్పటికీ తమ అనుబంధాన్ని ఎంతో అందంగా కొనసాగిస్తున్నారు. సినిమాలతో బిజీగా ఉంటూనే కుటుంబానికి కూడా సమయం కేటాయిస్తున్నారు. సైఫ్‌పై గతంలో జరిగిన కత్తి దాడి ఘటన సమయంలోనూ కరీనా ఆయనకు అండగా నిలిచారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saif Ali khan | రాత్రి 10 దాటితే కరీనా కపూర్ మౌనం.. ఏం జరిగిందో తెలియక తికమకపడిన సైఫ్ అలీ ఖాన్!
Scene | ‘సీన్’ ఫస్టాఫ్ అదిరిపోయింది.. సూర్య నటనకు ఫిదా అవుతున్న ప్రేక్షకులు, ట్విట్టర్లో మూవీ టాక్ ఎలా ఉందంటే?
January 12 Vidudala | కజకిస్థాన్‌లో వెంకటేష్, కళ్యాణ్ రామ్ సందడి.. ‘జనవరి 12 విడుదల’లో భారీ యాక్షన్ సీన్స్, స్పెషల్ సాంగ్!
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. ఫస్ట్ డే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు,తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
Dulqer Salmaan | ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’.. తెలుగు సహా పలు భాషల్లో స్ట్రీమింగ్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

