January 12 Vidudala | కజకిస్థాన్‌లో వెంకటేష్, కళ్యాణ్ రామ్ సందడి.. ‘జనవరి 12 విడుదల’లో భారీ యాక్షన్ సీన్స్, స్పెషల్ సాంగ్!
January 12 Vidudala | విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ తొలిసారి కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ‘జనవరి 12 విడుదల’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు.
January 12 Vidudala | విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ తొలిసారి కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ‘జనవరి 12 విడుదల’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో చిత్రబృందం వేగంగా షూటింగ్ పూర్తి చేస్తోంది. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను కజకిస్థాన్‌లో ప్రారంభించారు. ఈ షెడ్యూల్లో యాక్షన్ సన్నివేశాలతో పాటు ప్రత్యేక పాటను కూడా చిత్రీకరించేందుకు దర్శకుడు అనిల్ రావిపూడి ప్రణాళిక సిద్ధం చేశారు.
ముఖ్యంగా వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లపై రెండు కీలకమైన యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ రియల్ సతీష్ పర్యవేక్షణలో ఇద్దరు హీరోలపై భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ పోరాట ఘట్టం సినిమాలో ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలవనుంది. ఇక ఈ షెడ్యూల్లోనే వెంకటేష్, కళ్యాణ్ రామ్ కలిసి నటించే ప్రత్యేక పాటను కూడా షూట్ చేయనున్నారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. కజకిస్థాన్‌లోని అందమైన ప్రకృతి ప్రాంతాలు, పర్వతాల నేపథ్యంలో పాటను చిత్రీకరించనున్నారు. ఇద్దరు హీరోల ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్‌తో పాటు ఆకట్టుకునే విజువల్స్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సందర్భంగా చిత్రబృందం విడుదల చేసిన వర్కింగ్ స్టిల్‌లో వెంకటేష్, కళ్యాణ్ రామ్, దర్శకుడు అనిల్ రావిపూడి ఉత్సాహంగా కనిపిస్తున్నారు.
అనిల్ రావిపూడి సినిమాల్లో కామెడీ, కుటుంబ భావోద్వేగాలు, కమర్షియల్ అంశాలు ప్రధానంగా ఉంటాయి. ఈసారి ఇద్దరు స్టార్ హీరోలను ఒకే తెరపై చూపిస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. వెంకటేష్‌కు ఉన్న కామెడీ టైమింగ్, కుటుంబ ప్రేక్షకుల్లో ఆదరణ, కళ్యాణ్ రామ్ యాక్షన్ ఇమేజ్ను కలిపి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తుండటంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్, హాస్యం, యాక్షన్, పాటలు కలగలిపిన పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా ‘జనవరి 12 విడుదల’ను తీర్చిదిద్దుతున్నారు. సంక్రాంతి సీజన్‌ను లక్ష్యంగా చేసుకున్న ఈ సినిమా జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. కజకిస్థాన్ షెడ్యూల్లో తెరకెక్కుతున్న యాక్షన్ సన్నివేశాలు, ప్రత్యేక పాట ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటాయో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
January 12 Vidudala | కజకిస్థాన్‌లో వెంకటేష్, కళ్యాణ్ రామ్ సందడి.. ‘జనవరి 12 విడుదల’లో భారీ యాక్షన్ సీన్స్, స్పెషల్ సాంగ్!
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. ఫస్ట్ డే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు,తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
Dulqer Salmaan | ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’.. తెలుగు సహా పలు భాషల్లో స్ట్రీమింగ్!
Ramayana | ‘రామాయణ’లో తెలుగు ప్రేక్షకులకు సర్ప్రైజ్.. మేఘనాథుడిగా ‘ది ప్యారడైజ్’ విలన్
Jharkhand | జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

