గుండెకు.. అండగా!
మనిషి శరీరంలో అత్యంత కీలకమైన అవయవం గుండె. రక్తాన్ని సరఫరా చేస్తూ.. కణజాలం ద్వారా ప్రాణవాయువు, పోషకాలు శరీరం మొత్తానికి చేరుకునేలా చేస్తుంది.
మనిషి శరీరంలో అత్యంత కీలకమైన అవయవం గుండె. రక్తాన్ని సరఫరా చేస్తూ.. కణజాలం ద్వారా ప్రాణవాయువు, పోషకాలు శరీరం మొత్తానికి చేరుకునేలా చేస్తుంది. మనిషి మనుగడకు ఆరోగ్యకరమైన గుండె అవసరం. సమతులాహారం, క్రమం తప్పని వ్యాయామంతో కూడిన సరైన జీవనశైలి.. గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. మొత్తంగా గుండెకు అండ ఇవీ..
ఆరోగ్యకరమైన ఆహారం
గుండె ఆరోగ్యంలో సమతుల ఆహారానిది కీలకపాత్ర. ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేకం..
పొట్టుతీయని ధాన్యాలు
ఈ రకమైన ధాన్యంలో ఫైబర్, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించి.. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. దంపుడు బియ్యం, ఓట్మీల్, హోల్‌గ్రెయిన్ బ్రెడ్ లేదా పాస్తా ఆహారంలో భాగం చేసుకోవాలి.
ప్రొటీన్లు
కోళ్లు, చేపలు, కొవ్వు తక్కువ పాల పదార్థాలు, లేత మాంసం (ఇందులో తక్కువ సాచురేటెడ్ కొవ్వు ఉంటుంది).. ద్వారా అందే ప్రొటీన్లు గుండెకు ఎంతో మేలుచేస్తాయి.
పండ్లు, కూరగాయలు
వీటిలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలం. అదే సమయంలో క్యాలరీలు తక్కువ. రకరకాల పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకుంటే శరీర బరువు, రక్తపోటు (బీపీ) అదుపులో ఉంటాయి.
మంచి కొవ్వులు
అన్ని కొవ్వులూ చెడ్డవి కాదు. మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ కొవ్వులు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. అవకాడో, గింజలు, ఆలివ్, చేపలు ఆరోగ్యకరమైన కొవ్వులకు నిల్వలు.
ఉప్పు కొద్దిగా
సోడియం ఎక్కువగా తింటే అధిక రక్తపోటుకు దారితీస్తుంది. గుండె రక్తనాళాల జబ్బుల ముప్పు పొంచి ఉంటుంది. కాబట్టి, సోడియం ఉన్న ప్రాసెస్డ్ ఆహారాన్ని దూరం పెట్టాలి. మనం తినే తిండిలో అదనపు ఉప్పును చేర్చుకోకపోవడం మంచిది.
జీవనశైలి ప్రధానం
ఆహార అలవాట్లకు తోడు గుండె ఆరోగ్యం విషయంలో జీవనశైలి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.
క్రమం తప్పని వ్యాయామం
నిత్య వ్యాయామం, తగినంత శారీరక శ్రమ శరీర బరువును ఆరోగ్యకరమైన రీతిలో ఉంచుతాయి. కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయులను తగ్గిస్తాయి. ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సూచన మేరకు.. ప్రతి ఒక్కరూ వారానికి 150 నిమిషాలు ఓ మోస్తరు వ్యాయామం చేయాలి.
ధూమపానానికి దూరంగా
పొగ అలవాటు రక్తనాళాల (ధమనుల) లైనింగ్‌పై కొవ్వు పేరుకునేలా కీడుచేస్తుంది. దీంతో రక్తనాళాలు కుంచించుకుపోతాయి. ఇది గుండెపోటు లేదా స్ట్రోక్‌గా పిలిచే యాంజినాకు కారణమవుతుంది.
మద్యం పరిమితంగా
మద్యపాన వ్యసనం.. అధిక రక్తపోటుకు, గుండె వైఫల్యానికి, పక్షవాతానికి దారితీస్తుంది. కాబట్టి, పురుషులు రోజుకు మూడు నాలుగు యూనిట్లకు మించి, స్త్రీలు రెండు మూడు యూనిట్లకు మించి మద్యం సేవించకూడదు.
ఒత్తిడి నిర్వహణ
దీర్ఘకాలంగా వేధించే ఒత్తిడి కూడా గుండె సమస్యలకు దారి తీస్తుంది. ధ్యానం, యోగా, ఇతర ఉపశమన విధానాల ద్వారా ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి.
వైద్య పరీక్షలు
క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే రోగాల బారిన పడక ముందే సమస్య మూలాలు తెలుస్తాయి. తరచూ రక్తపోటు (బీపీ), కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ప్రపంచ వ్యాప్తంగా కూడా మరణాలకు చాలా సహజమైన కారణం గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే నాడుల (కరోనరీ ఆర్టెరీ) వ్యాధులే. జీవనశైలి మార్పులు, అనారోగ్యకరమైన ఆహార అలవాట్ల కారణంగా ఈ వ్యాధి ఇప్పుడు చిన్నవయసులోనే దాపురిస్తున్నది. గుండె జబ్బు నిర్ధారణ అయినప్పుడు, నిర్లక్ష్యం చేయకుండా.. నిపుణుల పర్యవేక్షణలో తగిన చికిత్స తీసుకోవాలి.
చిన్న అడుగులతో ప్రయత్నం
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే సమతులాహారం తీసుకోవాలి. చురుకైన జీవనశైలిని అనుసరించాలి. క్రమం తప్పక వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలికి మారడంలో ఏ మాత్రం ఆలస్యం చేయకూడదు. చిన్నచిన్న అడుగులతో మొదలుపెడితే క్రమంగా మంచి అలవాట్లు వాటంతట అవే పెంపొందుతాయి. ఆరోగ్యకరమైన జీవితం, పరిపూర్ణ ఆయువు సొంతం అవుతాయి.
– డా. రోహిత్ పి. రెడ్డి
సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్
యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

