ఈ సీజన్లో చిన్నపిల్లలకు దగ్గు, జలుబు, న్యుమోనియా తదితర వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించండి.
– ఓ పాఠకురాలు
చలికాలంలో పిల్లల శ్వాసకోశ వ్యవస్థకు వచ్చే వివిధ వ్యాధులను చాలావరకు నివారించవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. శిశుమరణాలనూ తగ్గించవచ్చు. పుట్టబోయే బిడ్డ మనుగడ తల్లి ఆరోగ్యంపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉన్నప్పుడే పిల్లలను కనాలి. గర్భం నిర్ధారణ కాగానే.. నిపుణులు సూచించిన ఆహారం, మందులు తీసుకోవాలి. అవసరమైన టీకాలు వేయించుకోవాలి. తగినంత విశ్రాంతీ అవసరమే. లేకపోతే.. నెలలు నిండకముందే ప్రసవం జరుగుతుంది. తక్కువ బరువు బిడ్డలు పుడతారు. ఆరు నెలలు నిండేవరకు, కేవలం తల్లిపాలు మాత్రమే తాగే పిల్లల్లో శ్వాస సంబంధ వ్యాధులే కాదు, ఇతర రుగ్మతలూ తక్కువే. ఒకవేళ వచ్చినా త్వరగా కోలుకుంటారు. తల్లిపాలు అందని బిడ్డలు న్యుమోనియాతో మరణించే ప్రమాదం అయిదు రెట్లు ఎక్కువ. దాంతోపాటు, సమయానికి టీకాలు వేయించడం వల్ల బ్యాక్టీరియా, వైరస్ వ్యాధులను నివారించవచ్చు. వివిధ వ్యాధులను అరికట్టే టీకాలివి..
డాక్టర్ కర్రా రమేశ్‌రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు, సికింద్రాబాద్.