మధుమేహులు కోడిగుడ్లు తింటే గుండెకు మంచిది కాదా.. అందులో నిజమెంత..?
Eggs for Diabetics: మధుమేహం ఉన్నవాళ్లు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఏది తినొచ్చో, ఏది తినగూడదో తెలుసుకుని ఆరోగ్యానికి ఎలాంటి హానీ లేదు అనుకున్న వాటిని మాత్రమే తమ మెనూలో చేర్చుకుంటారు. అయితే,

హైదరాబాద్: మధుమేహం ఉన్నవాళ్లు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఏది తినొచ్చో, ఏది తినగూడదో తెలుసుకుని ఆరోగ్యానికి ఎలాంటి హానీ లేదు అనుకున్న వాటిని మాత్రమే తమ మెనూలో చేర్చుకుంటారు. అయితే, కోడిగుడ్ల విషయంలో మాత్రం షుగర్ పేషెంట్లకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. తాము కోడిగుడ్లు తింటే గుండె జబ్బులు వస్తాయని చాలామంది డయాబెటిక్ రోగులు భయపడుతున్నారు. అందుకే గుడ్లను పూర్తిగా దూరం పెడుతున్నారు. కానీ అందులో వాస్తవం లేదని తాజాగా జరిగిన ఒక అధ్యయనంలో తేలింది.
మధుమేహుల్లో కోడిగుడ్లు తినని వారికంటే అవి తినే వారిలోనే గుండె వ్యాధుల ముప్పు తక్కువగా ఉన్నదని తాజా అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా ప్రీ-డయాబెటిస్, టైప్ -2 డయాబెటిస్ ఉన్నవారిలో గుడ్డువల్ల గుండె సమస్యలు తగ్గినట్లు అధ్యయనకారులు వెల్లడించారు. ‘సిడ్నీ యూనివర్సిటీ’ పరిశోధకులు జరిపిన ఈ అధ్యయనం ప్రకారం గుడ్డు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిదే. ఏడాదిపాటు వారానికి 1 నుంచి 12 గుడ్ల మధ్య తినే డయాబెటిక్ బాధితులకు గుండె జబ్బుల ముప్పు తక్కువట.
పరిశోధన జరిగిందిలా..
ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిని పరిశోధకులు మొత్తం మూడు గ్రూపులుగా విభజించారు. వారిలో ఒక్కొక్కరికి గరిష్టంగా వారానికి 12 గుడ్లు, కనిష్టంగా ఒక గుడ్డు చొప్పున ఇచ్చారు. ఇలా మూడు నెలలపాటు వారికి గుడ్లు అందించారు. చివరిగా అందరి ఆరోగ్యాన్ని పరిశీలించారు. ఈ పరిశీలనలో వారానికి 12 గుడ్లు తిన్నవారిలో కూడా గుండె సంబంధిత వ్యాధులకు కారణమయ్యే ప్రమాదకారకాలేవీ కనపించలేదట.
అందుకే గుడ్లను ఆహారంలో భాగం చేసుకోవడంవల్ల డయాబెటిక్ రోగులకు ముప్పేమీ లేదని పరిశోధకులు తేల్చారు. అందులోని ప్రొటీన్లు, సూక్ష్మ పోషకాలు డయాబెటిక్ రోగుల ఆరోగ్యానికి మేలు చేస్తున్నాయని నిర్ధారణకు వచ్చారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

