చెంపగడ్డలు వస్తే?
ఈ వ్యాధి ‘మిక్సో వైరస్ పరోటెడిస్' అనే వైరస్ వల్ల వస్తుంది. దీనినే ‘గవద బిళ్లలు’, ‘చెంప గడ్డలు’ అనీ పిలుస్తారు.
‘మంప్స్’ అంటే ఏమిటి? ఎందుకొస్తాయి? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఈ వ్యాధి ‘మిక్సో వైరస్ పరోటెడిస్’ అనే వైరస్ వల్ల వస్తుంది. దీనినే ‘గవద బిళ్లలు’, ‘చెంప గడ్డలు’ అనీ పిలుస్తారు. చెవి ముందు, కింద, దవడ భాగం వరకు విస్తరించి ఉన్న పరోటిడ్ లాలాజల గ్రంథి వాచిపోయి నొప్పిగా అనిపిస్తుంది. దీనివల్ల జ్వరం, తలనొప్పి, చెవినొప్పి మొదలవుతాయి. నోరు పూర్తిగా తెరిచి ఆహారం మింగడం కష్టం అవుతుంది. అరుదైన సందర్భాల్లో వాంతులు, కడుపునొప్పి రావచ్చు.
ఆ వ్యాధి నోటి నుంచి గాలి ద్వారా విస్తరిస్తుంది. తుమ్ము, దగ్గు, ఎంగిలి.. వాహకాలుగా పనిచేస్తాయి. వైరస్ శరీరంలో ప్రవేశించిన రెండుమూడు వారాలకు వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. రోగం సోకిన పదిమందిలో ఒకరికి మెదడువాపు రావచ్చు. నలుగురిలో ఒకరికి వృషణాలు వాచిపోతాయి. నొప్పిగానూ ఉంటుంది. సమస్య యుక్త వయసులో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోగుల వీర్య కణాల ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల భవిష్యత్తులో పిల్లలు పుట్టకపోవచ్చు. ఇరవై వేలమందిలో ఒకరికి చెముడు కూడా వస్తుంది. పదివేలమందిలో ఒకరు మరణిస్తారు. పిల్లలకు ఎంఎంఆర్ టీకాలను ఇప్పించడం ద్వారా వ్యాధి నియంత్రణ కొంతమేర సాధ్యమే.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen kumar | మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సూచన
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్గా యువరాజ్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

