Iron Rich Fruits | మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాల్లో ఐరన్ కూడా ఒకటి. ఐరన్ మన శరరీంలో అనేక విధులను నిర్వర్తిస్తుంది. ఇది కణాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. శరీరంలో శక్తిని ఉత్పత్తి చేసేందుకు సహాయం చేస్తుంది. కణజాలం ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. కనుక మనకు ఐరన్ అవసరం అవుతుంది. ఐరన్ లోపిస్తే రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. అలాగే శరీర రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. అయితే పలు రకాల పండ్లను తినడం వల్ల ఐరన్ లోపం ఏర్పడకుండా చూసుకోవచ్చు. మనకు అందుబాటులో ఉండే కొన్ని రకాల పండ్లను తింటే ఐరన్ మనకు సమృద్ధిగా లభిస్తుంది. ఈ పండ్లను తినడం వల్ల పలు ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
పుచ్చకాయల్లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. 100 గ్రాముల పుచ్చకాయలను తింటే సుమారుగా 0.4 మిల్లీగ్రాముల మేర ఐరన్ లభిస్తుంది. అయితే ఐరన్ ఇందులో మరీ అంతగా లేకపోయినప్పటికీ మన శరీరానికి రోజుకు కావల్సిన ఐరన్‌ను మాత్రం అందిస్తుంది. కనుక పుచ్చకాయలను ఆహారంలో భాగం చేసుకుంటే ఐరన్‌ను పొందవచ్చు. మనకు ప్రస్తుతం పుచ్చకాయలు సీజన్లతో సంబంధం లేకుండా ప్రతి సీజన్లోనూ అందుబాటులో ఉంటున్నాయి. కనుక ఈ పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే ఐరన్‌ను పొందవచ్చు. అలాగే దానిమ్మ పండ్లలోనూ ఐరన్ సమృద్ధిగానే ఉంటుంది. ఇందులో 100 గ్రాములకు సుమారుగా 0.3 మిల్లీగ్రాముల మేర ఐరన్ లభిస్తుంది. ఈ పండ్ల ద్వారా మనకు విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కూడా లభిస్తాయి. ఇవి మనల్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి.
మల్బెర్రీ పండ్లను తినడం వల్ల కూడా ఐరన్‌ను పొందవచ్చు. 100 గ్రాముల మల్బెర్రీ పండ్ల ద్వారా సుమారుగా 2.6 మిల్లీగ్రాముల మేర ఐరన్ లభిస్తుంది. వీటిల్లో ఐరన్‌తోపాటు విటమిన్ సి కూడా సమృద్ధిగానే ఉంటుంది. ఇవి రోగాలు రాకుండా చూస్తాయి. అలాగే ఖర్జూరాలను తినడం వల్ల కూడా ఐరన్ సమృద్ధిగానే లభిస్తుంది. సుమారుగా 100 గ్రాముల ఖర్జూరాలను తింటే 0.9 మిల్లీగ్రాముల మేర ఐరన్ లభిస్తుంది. ఖర్జూరాల్లో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. ఇవి మనకు ఆరోగ్యాన్ని, శక్తిని అందిస్తాయి.
100 గ్రాముల కిస్మిస్లను తినడం వల్ల సుమారుగా 1.9 మిల్లీగ్రాముల మేర ఐరన్ లభిస్తుంది. రాత్రి పూట వీటిని నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తింటే మంచిది. దీంతో కావల్సినంత ఐరన్ లభిస్తుంది. అంజీర్ పండ్లను తినడం వల్ల కూడా ఐరన్‌ను పొందవచ్చు. 100 గ్రాముల అంజీర్ పండ్లను తింటే 0.2 మిల్లీగ్రాముల మేర ఐరన్ లభిస్తుంది. అదే అంజీర్ డ్రై ఫ్రూట్స్‌ను తింటే ఇంకా ఎక్కువ ఐరన్‌ను పొందవచ్చు. వీటిని తినడం వల్ల ఫైబర్ సైతం సమృద్ధిగా లభిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
యాప్రికాట్ పండ్లలోనూ ఐరన్ సమృద్ధిగానే ఉంటుంది. 100 గ్రాముల యాప్రికాట్లను తింటే సుమారుగా 2.7 మిల్లీగ్రాముల మేర ఐరన్ లభిస్తుంది. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు సైతం సమృద్ధిగానే ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇలా పలు రకాల పండ్లు, డ్రై ఫ్రూట్స్‌ను తినడం వల్ల ఐరన్‌ను పొందవచ్చు. ఐరన్ లభిస్తే శరీర కణాలకు ఆక్సిజన్ అందుతుంది. దీంతో నీరసం, అలసట కూడా తగ్గుతాయి. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. ఉత్సాహంగా ఉంటారు.