Blue tea benefits | మనలో చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే టీ తాగడం అలవాటు. ఇంకొందరు గ్రీన్ టీ తాగుతుంటారు. మరికొందరు బ్లాక్ టీ సేవిస్తుంటారు. ఈ టీలతో బోర్ కొట్టినట్లు అనిపిస్తుందా? మరెందుకాలస్యం.. ఈ బ్లూ టీని ఒకసారి ట్రై చేయండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే ఈ బ్లూ టీని ఒకసారి తాగారో.. ఇక దీన్ని విడవరని చెప్పడంలో ఎలాంటి ఔచిత్యం లేదు. బ్లూ టీనే బటర్‌ఫ్లై పీ ఫ్లవర్ టీ అని కూడా పిలుస్తారు. ఎండిన లేదా తాజా బ్లూ బటర్‌ఫ్లై పీ ఫ్లవర్స్‌తో తయారుచేస్తారు. ఇది కెఫిన్ రహిత మూలికా కషాయం.
బ్లూ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పెద్ద మొత్తంలో ఉండి మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. ఈ టీని అలవాటు చేసుకుంటే ఒత్తిడి మటుమాయం అవడం ఖాయమంటున్నారు నిపుణులు. శరీరం బరువు తగ్గించుకునేందుకు కూడా ఈ టీ తాగవచ్చు. ఈ టీ అద్భుతమైన, అసాధారణమైన నీలం రంగును కలిగి ఉంటుంది. దీనికి నిమ్మరసం కలపగానే గులాబీ రంగులోకి మారుతుంది. వేడిగాగానీ, చల్లగాగానీ తీసుకోవచ్చు. ఈ రుచికరమైన, రిఫ్రెష్ టీని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు.
తయారీ విధానం..
ఓ గిన్నెలో నీరు తీసుకుని మరిగించాలి. ఫిల్టర్ వాటర్ వాడటం చాలా మంచిది. ఈ వేడి నీటికి బటర్‌ఫ్లై పీ పౌడర్‌ను కలిపి టీపాట్‌లో పోసుకోవాలి. అలా ఓ ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత దీనికి తేనె గానీ, చక్కెర గానీ కలిపి తాగాలి. రుచి కోసం కొంత నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. కోల్డ్ టీ చేసుకోవాలనుకుంటే మరిగించి పక్కన పెట్టిన డికాక్షన్‌కు కొంచెం ఐస్ కలిపి ఉంచి అనంతరం సర్వ్ చేసుకోవాలి.
ఆరోగ్య ప్రయోజనాలు..
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఇది అర్హత కలిగిన వైద్య అభిప్రాయానికి ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ వైద్య నిపుణుడిని లేదా ఇంటి వైద్యుడిని సంప్రదించండి. ఈ కథనంతో ‘నమస్తే తెలంగాణ’ యాజమాన్యం ఎలాంటి బాధ్యత వహించదు.