నల్లగొండ : నా జన్మదిన వేడుకల ఏర్పాట్లలో భాగంగా ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్ తో(Electric shock) మరణించిన రాజు రెడ్డి అనే కార్యకర్త మరణించడం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసిందని, అందుకే ఆయన మృతికి సంతాపంగా మంగళవారం నాటి తన జన్మదిన వేడుకలు రద్దు చేసుకుంటున్నట్లు నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి(Kancharla Bhupal Reddy) ప్రకటించారు. రాజు రెడ్డి మృతికీ సంతాపం ప్రకటిస్తూవారి కుటుంబ సభ్యులకునా తన ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తున్నట్లు తీవ్ర విచారం వ్యక్తం చేసారు.
మరణించిన రాజుని తీసుకురాలేమంటూ, వారి కుటుంబానికి అండగా నిలబడదామ్మని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా తన వంతుగా తక్షణ సాయంగా రూ. 8 లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తూ రాజు కుమారుడు, కూతురు పేర్లపై 4 లక్షల చొప్పున డిపాజిట్ చేయాలనీ భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇటువంటి కష్టకాలంలో వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం మనందరిపై ఉన్నదన్నారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు వారికి అండగా ఉండి ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు.
తన బర్త్డే సందర్బంగా కార్యకర్తలు, అభిమానులు తేవాలనుకున్న ప్రతి శాలువా, ప్రతి పూల బొకె, కేక్ లకు బదులుగా అదే ఖర్చును దయచేసి రాజురెడ్డి భార్య కలకుంట్ల భవ్యశ్రీ అకౌంట్ నెంబర్ కి ఆర్థిక సహాయంగా చేయాలని పిలుపునిచ్చారు. ఈ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకొని BRS కుటుంబ సభ్యులమందరమూ, ఎవరికి ఏ ఆపద, ఏ అత్యవసరం కలిగినా కలిసికట్టుగా నిలబడుతామని నిరూపిద్దామని ఈ సందర్బంగా కంచర్ల భూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.