Kangana Ranaut | రాఖీ యాడ్‌తో ట్రోలింగ్ బారిన కృతి సనన్ .. ఘాటుగా స్పందించిన కంగనా రనౌత్!
Kangana Ranaut | రక్షా బంధన్ పండుగ సందర్భంగా ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ నటించిన ఓ ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. సాంప్రదాయ పండుగ నేపథ్యంలో రూపొందించిన ఈ యాడ్‌లో కృతి ధరించిన ఇండో-వెస్ట్రన్ దుస్తులపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Kangana Ranaut | రక్షా బంధన్ పండుగ సందర్భంగా ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ నటించిన ఓ ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. సాంప్రదాయ పండుగ నేపథ్యంలో రూపొందించిన ఈ యాడ్‌లో కృతి ధరించిన ఇండో-వెస్ట్రన్ దుస్తులపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ వివాదంపై బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ కూడా స్పందించడంతో విషయం మరింత హాట్ టాపిక్‌గా మారింది. రక్షా బంధన్ వంటి సాంప్రదాయ పండుగకు సంబంధించిన ప్రకటనలో ఇలాంటి దుస్తులు అవసరమా అంటూ కంగనా రనౌత్ ప్రశ్నించారు. మహిళలకు చీరలు, లెహంగాలు, జీన్స్, ఇతర ఆధునిక దుస్తులు ఇలా ఎన్నో ఎంపికలు ఉన్నప్పటికీ, సోదరుడికి రాఖీ కట్టే సందర్భంలో ఇలాంటి బోల్డ్ అవుట్‌ఫిట్ ఎందుకు ఎంచుకున్నారని ఆమె తన సోషల్ మీడియా వేదికగా విమర్శించారు.
ఈ ప్రకటనను కావాలనే వివాదాస్పదంగా, ఆకర్షణీయంగా రూపొందించినట్లు అనిపిస్తోందని కూడా కంగనా వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కృతి సనన్ ధరించిన దుస్తులపై కొందరు నెటిజన్లు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. రక్షా బంధన్ పండుగ భావోద్వేగానికి, సంప్రదాయానికి తగ్గట్టుగా యాడ్ ఉండాల్సిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం ఇది కేవలం ఫ్యాషన్, ప్రకటనలోని క్రియేటివ్ కాన్సెప్ట్ మాత్రమేనని కృతి సనన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో రెండు వర్గాల మధ్య చర్చ కొనసాగుతోంది. అయితే ఈ వివాదంపై కృతి సనన్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు.
ఇదిలా ఉంటే, కృతి సనన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో కెరీర్లో దూసుకుపోతున్నారు. మరోవైపు కంగనా రనౌత్ కూడా తన సినిమాలు, ఇతర బాధ్యతలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఒక జ్యువెలరీ యాడ్ కారణంగా ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్ల పేర్లు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. మొత్తానికి రక్షా బంధన్ ప్రకటనలో కృతి సనన్ లుక్‌పై మొదలైన చర్చకు కంగనా రనౌత్ స్పందన మరింత ఆజ్యం పోసింది. ఈ వివాదంపై కృతి స్పందిస్తారా? లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Outrageous mockery of sacred traditions!
The #GIVAJwellery RakshaBandhan ad featuring @kritisanon trivializes our heritage for commercial gains.
We urge @cyberpolice_up & @KarnatakaCops to register an FIR for hurting religious sentiments. Take this down! 🛑@DgpKarnataka https://t.co/p8Jvm5tfN1 pic.twitter.com/BRBu10pXtq
— 🚩Mohan Gowda🇮🇳 (@Mohan_HJS) August 24, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

