ABC Juice Benefits | మీరు ఏబీసీ జ్యూస్ గురించి ఎప్పుడైనా విన్నారా. అవును, మేం చెబుతోంది నిజమే. ఏబీసీ జ్యూస్ అంటే.. యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్ గురించి. అవును, ఈ మూడింటితో తయారు చేసిన జ్యూస్ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ జ్యూస్ చాలా పేరుగాంచిందని చెప్పవచ్చు. డాక్టర్లు సైతం ఈ జ్యూస్ తాగమని సలహా ఇస్తుంటారు. యాపిల్, బీట్రూట్, క్యారెట్ వేసి తయారు చేసిన జ్యూస్‌ను రోజూ ఒక కప్పు తాగితే చాలు, అనేక లాభాలను పొందవచ్చు. ఈ జ్యూస్‌ను 100 ఎంఎల్ తాగితే 45 నుంచి 50 క్యాలరీల శక్తి లభిస్తుంది.
100 ఎంఎల్ యాపిల్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్‌లో 10 నుంచి 12 గ్రాముల వరకు పిండి పదార్థాలు ఉంటాయి. 8 నుంచి 9 గ్రాముల మేర చక్కెర ఉంటుంది. 0.5 గ్రాముల ప్రోటీన్, ఇతర ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్ ఈ జ్యూస్‌లో ఉంటాయి. ఈ జ్యూస్‌ను తాగడం వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. తెల్ల రక్త కణాలు అధికంగా ఉత్పత్తి అవుతాయి. రక్తం కూడా తయారవుతుంది. దీంతో రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ జ్యూస్‌ను తాగితే శరీరంలోని అవయవాలు డిటాక్స్ అవుతాయి. వాటిల్లో ఉండే చెత్త, వ్యర్థాలు బయటకు పోతాయి. దీంతో అన్ని అవయవాలు ఆరోగ్యంగా మారుతాయి. జీవక్రియలు సరిగ్గా నిర్వహించబడతాయి.
ఈ జ్యూస్‌ను తాగడం వల్ల చర్మం, శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ జ్యూస్‌లో ఉండే విటమిన్లు, మినరల్స్ చర్మం సాగే గుణాన్ని ప్రోత్సహిస్తాయి. దీంతో వయస్సు మీద పడడం వల్ల వచ్చే వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. దీంతోపాటు జుట్టు నల్లగా మారుతుంది. దీని వల్ల యవ్వనంగా కనిపిస్తారు. ఈ జ్యూస్‌ను తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ఇందులో ఫైబర్ జీర్ణక్రియను పెంపొందిస్తుంది. ఈ జ్యూస్‌ను తాగడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. దీంతో మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజూ సుఖ విరేచనం అవుతుంది. పేగుల్లో మలం కదలికలు సరిగ్గా ఉంటాయి. ఈ జ్యూస్‌ను తాగడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. తీవ్రమైన అలసట, నీరసం ఉన్నవారు ఈ జ్యూస్‌ను తాగితే శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్‌గా పనిచేస్తారు.
యాపిల్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలకు బదులుగా ఈ జ్యూస్‌ను తాగుతుంటే బరువును అదుపులో ఉంచుకోవచ్చు. దీంతో చక్కెర పానీయాలను తాగాలనే ఆసక్తి కూడా తగ్గిపోతుంది. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. అయితే ఈ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నప్పటికీ అందరికీ ఈ జ్యూస్ పడదు. దీన్ని తాగితే కొందరిలో విరేచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి వారు ఈ జ్యూస్‌ను తాగకూడదు. అలాగే అలర్జీలు ఉన్నవారు తాగకూడదు. మెడిసిన్లను వాడేవారు డాక్టర్ సలహా మేరకు ఈ జ్యూస్‌ను తాగితే మంచిది.