Wonder Pill | ఈ ట్యాబ్లెట్‌తో సగానికి తగ్గనున్న క్యాన్సర్ మరణాల ముప్పు
లంగ్ క్యాన్సర్ నుంచి మరణాల ముప్పును 50 శాతం తగ్గిస్తూ వినూత్న ఆవిష్కరణగా ముందుకొచ్చిన నూతన ట్యాబ్లెట్ (Wonder Pill) ఆశలు రేకెత్తిస్తోంది.
న్యూయార్క్ : లంగ్ క్యాన్సర్ నుంచి మరణాల ముప్పును 50 శాతం తగ్గిస్తూ వినూత్న ఆవిష్కరణగా ముందుకొచ్చిన నూతన ట్యాబ్లెట్ (Wonder Pill) ఆశలు రేకెత్తిస్తోంది. పదేండ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా చేపట్టిన క్లినికల్ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు రావడంతో ఈ వండర్ పిల్ క్యాన్సర్ రోగుల్లో ఆశాకిరణంలా మారింది. చికాగోలో జరిగిన అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ వార్షిక సమావేశంలో వెల్లడించిన సర్వే ఫలితాల్లో ఈ విషయం వెలుగుచూసింది.
టాగ్రిసోగా మార్కెట్ కానున్న ఓసిమెర్టినిబ్ అనే డ్రగ్ లంగ్ క్యాన్సర్ రోగుల్లో ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. కాగా, ఈ మందును ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసింది. క్యాన్సర్ మరణాల్లో అత్యధికంగా లంగ్ క్యాన్సర్ మరణాలు నమోదవుతుండగా ఏటా 18 లక్షల మంది లంగ్ క్యాన్సర్‌తో మృత్యువాతన పడుతున్నారు.
ఈ రోగులకు ఉపశమనంగా 30 ఏండ్ల కిందట మన ఏం చేయలేకపోయేవారమని అధ్యయన రచయిత, యేల్ క్యాన్సర్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రాయ్ హెర్బస్ట్ పేర్కొన్నారు. లంగ్ క్యాన్సర్ చికిత్సలో ఇప్పుడు ఈ ఔషధం ముందుకొచ్చిందని, థెరఫీలకు లొంగని లంగ్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల్లో యాభై శాతం మరణాలను తగ్గించే అద్భుతమైన ఔషధం ఇదని చెప్పారు. ఈ మందును 26 దేశాల్లోని రోగులపై పరీక్షించామని తెలిపారు.
Read More
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

