ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినడం లేదా రోజులో ఎక్కువ కేలరీలు తీసుకోవడంలాంటివి చెడు అలవాట్లకిందికే వస్తాయి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవడం వల్ల కాలక్రమేణా బరువు పెరుగుతారు. మధుమేహం, గుండె జబ్బులలాంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారినపడతారు. కొంతమంది ఆందోళనగా ఉన్నప్పుడు అతిగా తింటారు, మరికొందరు తమకు ప్రణాళిక లేకపోవడం లేదా విసుగుచెందడంవల్ల కూడా ఎక్కువ మొత్తంలో తినేస్తుంటారు.