HomeGeneralPower Star Pawan Kalyan Sensation On Instagram He Got 14 Lakh Followers Without Any Post
Pawan Kalyan | ఒక్క పోస్టు కూడా పెట్టలేదు.. అప్పుడే మిలియన్ ఫాలోవర్స్.. అదీ పవర్ స్టార్ రేంజ్!!
ట్విట్టర్ అకౌంట్‌కు పెట్టిన ప్రొఫైల్ ఫొటోనే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పిక్‌గా పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్.
2/9
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకు ఉన్న క్రేజ్ ఏంటో ఇప్పుడు మరోసారి రుజువైంది.
3/9
ఇన్‌స్టాగ్రామ్‌లోకి అలా అడుగుపెట్టాడో లేదో లక్షలాది మంది ఫాలోవర్స్ వచ్చి చేరారు.
4/9
ఇప్పటికే ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు చేరువలో ఉన్నారు.
5/9
తన సినిమాల అప్డేట్స్ కంటే కూడా రాజకీయంగానే తన సోషల్‌మీడియా అకౌంట్లను పవన్ కళ్యాణ్ వాడుతున్నారు. సామాజిక మాధ్యమంగా వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ పార్టీని ఏకిపారేస్తున్నారు.
6/9
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదే గడువు ఉండటంతో జనాలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి కూడా అడుగుపెట్టారు.
7/9
మంగళవారం ఉదయం పవన్ కళ్యాణ్ ఇన్‌స్టా ఖాతాను తెరవగా.. కొద్దిసేపటికే వెరిఫైడ్ టిక్ కూడా లభించింది.
8/9
ట్విట్టర్లో ఉన్న ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో.. జైహింద్ అనే స్లోగన్నే ఇన్‌స్టాలోనూ యాడ్ చేశారు.
9/9
ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేసిన గంటల్లోనే లక్షల మంది పవన్ కళ్యాణ్‌ను ఫాలో అయ్యారు.
10/9
ఇంకా ఒక్క పోస్టు కూడా పెట్టకుండానే 14 లక్షల మంది ఫాలో అవుతుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇదీ పవర్ స్టార్ రేంజ్ అని గొప్పగా చెప్పుకుంటున్నారు.