Apps:
Follow us on:

Kaleshwaram Project | కాళేశ్వర గంగ పారంగ.. తెలంగాణ మురవంగ.. ఫొటో స్టోరీ

1/16కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)లో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి.
2/16ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు వరకు వానకాలం పంటకు సాగునీరు ఇవ్వడమే లక్ష్యంగా కాళేశ్వరం ఎత్తిపోతల (Kaleshwaram Lift Irrigation Project)ను అధికారులు నడిపిస్తున్నారు.
3/16జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలం మేడిగడ్డలోని లక్ష్మీ బరాజ్‌ వద్ద ప్రాణహిత నుంచి 19,200 క్యూసెకులు ఇన్‌ఫ్లో వచ్చి గోదావరిలో కలుస్తున్నది.
4/16వాటిని లింక్‌- 1, 2లలో 18 మోటర్లను ప్రారంభించి, నీటిని తరలిస్తున్నారు. కన్నెపల్లిలోని లక్ష్మీ పంప్‌ హౌస్‌లో ఆరు పంపులను ఆన్‌ చేసి 13,200 క్యూసెకుల నీటిని అన్నారంలోని సరస్వతీ బరాజ్‌లోకి ఎత్తిపోస్తున్నారు.
5/16పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాసిపేటలోని సరస్వతీ పంపుహౌస్‌లో నాలుగు పంపులను ఆన్‌చేసి 11,720 క్యూసెకుల నీటిని మంథని మండలం సిరిపురంలోని పార్వతీ బరాజ్‌లోకి,
6/16అంతర్గాం మండలం గోలివాడలోని పార్వతీ పంపు హౌస్‌లోని నాలుగు మోటర్లను ఆన్‌ చేసి 10,440 క్యూసెకుల నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోస్తున్నారు.
7/16ఎల్లంపల్లికి చేరిన కాళేశ్వరం జలాలు టన్నెల్‌ ద్వారా ధర్మారం మండలం నందిమేడారంలోని నందిపంపు హౌస్‌కు వెళ్తున్నాయి.
8/16అకడి రెండు మోటర్లను ఆన్‌ చేసి అండర్‌ టన్నెల్‌ ద్వారా 6300 క్యూసెకుల నీటిని నంది రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తున్నారు.
9/16అకడి నుంచి టన్నెల్‌ ద్వారా కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌కు అండర్‌ టన్నెళ్ల ద్వారా నీటిని తరలిస్తున్నారు.
10/16అకడ రెండు మోటర్లను ఆన్‌ చేసి 6,300 క్యూసెకుల నీటిని ఎత్తిపోస్తూ అప్రోచ్‌ కెనాల్‌ ద్వారా వరద కాలువకు తరలిస్తున్నారు.
11/16షానగర్‌ శివారులో వరదకాలువ 102 కిలోమీటర్‌ వద్ద ఏర్పాటుచేసిన గేట్లను అధికారులు మూసివేశారు.
12/16వరద కాలువకు చేరుకున్న కాళేశ్వరం జలాలు రివర్స్‌ పంపింగ్‌ ద్వారా మల్యాల మండలం రాంపూర్‌ పంపుహౌజ్‌కు తరలివెళ్తున్నాయి.
13/16అక్కడి నుంచి పంపులు ఆన్‌ చేసి.. రాజేశ్వర్‌రావుపేటకు ఎత్తిపోస్తున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచి రాజేశ్వర్‌రావు పేట పంపుహౌస్‌ నుంచి ముప్కాల్‌ పంపుహౌస్‌కు నీటిని ఎత్తిపోయనున్నారు. రెండు మూడు రోజుల్లోనే కాళేశ్వరం జలాలు ఎస్సారెస్పీకి చేరనున్నాయి.
14/16ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి ఒక మోటర్‌ ద్వారా మంగళవారం పంపింగ్‌ ప్రారంభించారు.
15/16దేవాదుల మోటర్ల ద్వారా గోదావరి నీటితో భీం ఘనపురం రిజర్వాయర్‌ నింపి రైతుల పంట పొలాలకు నీరు అందించేందుకు సన్నద్ధమయ్యారు.
16/16దేవాదుల ఎత్తిపోతలలోని ఫేస్‌ 3 నుంచి ఒక మోటర్‌ ద్వారా రోజుకు 294 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు.