
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 48 గంటలుగా ఎడతెరిపిలేని వానలతో అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది.

మరోవైపు వచ్చే నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది.

ఐదు జిల్లాలకు రెడ్, 7 జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. సియర్ సూన్ ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని, నైరుతి రుతుపవనాల ద్రోణి, కొంతమేరకు తెలంగాణ వైపునకు వచ్చిందని వాతావరణ విభాగం సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు.

అల్పపీడన ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆగస్టు మొదటి వారం వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధికారులు జలాశయాల్లో నీటి మట్టం, ఎత్తు తక్కువ కల్వర్టులు, రహదారులు, లోతట్టు ప్రాంతాలపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పలు జిల్లాల కలెక్టరేట్లలో ఇప్పటికే కంట్రోల్ రూమ్‌లను, హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, దుమ్ముగూడెంలో 11.9 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో సోమవారం రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి.

కరీంనగర్‌లో లోయర్ మానేరు డ్యాంలో వేటకు వెళ్తున్న మత్స్యకారుడు

లోయర్ మానేరు డ్యాం కింద పచ్చగా కళకళలాడుతున్న పంట పొలాలు

హైదరాబాద్‌లో బుధవారం కురిసిన జోరువానలో తడుస్తున్నా సోదరుడి చేయి పట్టుకుని ఆనందంగా స్కూలుకు వెళ్తున్న చిన్నారి

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో గాయత్రి జలపాతం హొయలు

వనపర్తి జిల్లాలో నాట్లు వేసేందుకు చీరలో నారు తీస్తుకెళ్తున్న మహిళా రైతులు

వరంగల్‌లోని పైడిపల్లి గ్రామంలో వర్షానికి తడిసి కూలిన గోడ

ములుగు జిల్లా వెంకటాపురం (నూగూరు) మండలంలో పాలెంవాగు ప్రాజెక్టుకు గండి పడడంతో పారుతున్న నీరు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని కాకర్లపల్లి ఊరచెరువు అలుగు కింద చేపలు పడుతున్న యువకులు

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో పొలం పనుల్లో మహిళా రైతులు

ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఇద్దరు గర్భిణులను బోటులో ఒడ్డు దాటిస్తున్న రెస్క్యూ టీం

మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి బుధవారం కొద్దిసేపు కూలీలతో కలిసి నాట్లు వేసి సందడి చేశారు. బుధవారం హవేళీఘనపూర్ మండలం చౌట్లపల్లి శివారులో మహిళా కూలీలు వరినాట్లు వేయడాన్ని గమనించిన ఆమె తన కారు ఆపి నేరుగా పొలంలోకి వెళ్లారు. వాన కురుస్తున్నా లెక్కచేయకుండా సరదాగా పాట పాడుతూ కూలీలతో కలిసి నాట్లు వేశారు. ఎమ్మెల్యే తమతో కలిసి నాట్లు వేయడంతో రైతులు, కూలీలు సంబురపడ్డారు.

కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బుధవారం కొద్దిసేపు వ్యవసాయ పనులు చేపట్టారు. గంగాధర మండలం లింగంపల్లి గ్రామ పర్యటనకు వెళ్లిన ఆయన రైతులను పలుకరిస్తూ 24 గంటల కరెంట్ ప్రాధాన్యతను తెలియజేశారు. అక్కడే ఉన్న మహిళా కూలీలతో గొంతుకలిపి, వారితో కలిసి నాట్లు వేశారు. కేసీఆర్ సర్కారు అమలు చేస్తున్న పథకాలపై ఈరవేణి మల్లవ్వ అనే కూలీ ఉయ్యాల పాట పడి అందరినీ ఆకట్టుకున్నది.

జనగామ జిల్లా దేవరుప్పులలో నాట్లు వేయడానికి వచ్చిన ఆంధ్రా కూలీలు

ఒకవైపు ట్రాక్టర్ దున్నుతున్నది.. ఇంకోవైపు రైతులు నారు తీస్తున్నారు.. మరోవైపు నాట్లు వేస్తున్నారు.. బుధవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల్ గ్రామంలో వరి నాట్లలో నిమగ్నమైన మహిళలు

జూబ్లీహిల్స్ చౌరస్తాలో కురుస్తున్న వర్షం

షేక్‌పేట ఫ్లైఓవర్ మార్గంలో కురుస్తున్న వర్షం

ట్యాంక్‌బండ్ రోడ్‌లో కురుస్తున్న వర్షం

సికింద్రాబాద్‌లో కురుస్తున్న వర్షం

అమీర్‌పేట్‌లో వర్షంలో గొడుగు పట్టుకొని వెళ్తున్న మహిళలు