Apps:
Follow us on:

CM KCR | రాష్ట్రంలో రైతుకు ఎరువు కరువు తీరిందిట్లా..

1/17ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి పంటకాలానికి ముందు తెలంగాణ అంతటా ఒకే దృశ్యం.
2/17ఎరువుల కరువు, రైతుల ఇక్కట్లు, టోకెన్లు, చెప్పుల బారులు, బస్తాల కోసం కుస్తీలు, లారీలపై దాడులు, విరిగిన లాఠీలు, దుకాణాల లూటీలు!
3/17తెలంగాణ రాష్ట్రంలో ఈ దృశ్యం అదృశ్యమైంది. ఇప్పుడెక్కడా ఎరువుల కరువు లేదు. రైతుల బారులు, బాధలూ లేవు. బ్లాక్‌ మార్కెటింగ్‌ లేదు.
4/17కొట్లాటలు, క్యూలైన్లు లేవు. గోడౌన్లలో గుట్టలకొద్దీ ఎరువులు సీజన్‌కు ముందే సిద్ధంగా ఉంటున్నాయి.
5/17గడిచిన 9 ఏండ్లలో పంటల సాగు విస్తీర్ణం పెరిగి ఎరువుల వినియోగం రెట్టింపైంది. అయినప్పటికీ ఎక్కడా కొరత ఎందుకు లేదు?
6/17దీని వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన ఉన్నది. ముందుచూపు ఉన్నది, ఎరువుల, విత్తనాల కరువును దూరం చేసిన ప్రణాళిక ఉన్నది.
7/17ఉమ్మడి రాష్ట్రంలో మెదక్‌ జిల్లాలో చెప్పులను వరుసలో పెట్టి ఎరువుల కోసం నిరీక్షిస్తున్న రైతులు
8/1715 జూన్‌ 2011న సూర్యాపేట పట్టణంలోని ‘మన గ్రోమోర్‌' దుకాణం వద్ద ఎరువుల బస్తాల కోసం బారులుతీరిన రైతులు
9/17ఖమ్మం పట్టణంలో ఎరువుల కోసం వచ్చి రాళ్లదాడిలో గాయపడిన ఓ మహిళ
10/17ఎరువుల కొరతపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఖమ్మం పట్టణంలో ఓ ఫర్టిలైజర్‌ షాపులోంచి పురుగు మందులను ఎత్తుకెళ్తున్న రైతులు
11/17ఖమ్మం పట్టణంలో ఎరువుల కోసం జరిగిన కొట్లాటలో తీవ్రంగా గాయపడిన రైతు
12/17సూర్యాపేటలోని గ్రోమోర్‌ దుకాణం వద్ద ఎరువుల కోసం ఎగబడుతున్న రైతులు.. 2011 జూన్‌ 15 నాటిది ఈ చిత్రం
13/17ఎరువుల కొరతపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ సూర్యాపేట పట్టణంలో ఓ లారీలోంచి యూరియా బస్తాలను ఎత్తుకెళ్తున్న అన్నదాతలు
14/17వానకాలం సీజన్‌లో పంటల సాగుకు అన్నదాతలకు ఇబ్బందులు కలుగకుండా నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌లో దిగుమతి చేసుకొన్న ఎరువుల బస్తాలు
15/17రైతులకు పంపిణీ చేసేందుకు కరీంనగర్‌లోని ఓ గోదాంలో నిల్వచేసిన ఎరువులు
16/17సమైక్య పాలనలో ఖమ్మం పట్టణంలోని ఓ ఎరువుల దుకాణం షట్టర్‌ పగులగొట్టి ఎరువుల బస్తాలను తీసుకెళ్తున్న రైతులు
17/17మెదక్‌ పట్టణంలోని ఫర్టిలైజర్‌ దుకాణాలలో అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుష్కలంగా లభిస్తున్న ఎరువులు