Balance between goals | లక్ష్యాల మధ్య బ్యాలెన్స్..
-రేపు మీరు సాధించబోయే విజయం మీ కాన్షస్ మైండ్‌కు ఒక అద్భుతమైన ఉత్కంఠను కల్గించే అనుభవం. అయితే, మీ అన్కాన్షస్ మైండ్‌కు ఇది ఏనాటి నుంచో అలవాటు చేసిన ఒక ఇంద్రియ అనుభవం కావాలి. రేపటి విజయం మీ కాన్షస్కు కొత్తేమోకానీ, మీ అన్కాన్షస్కి కొత్త ఏ మాత్రం కాకూడని విధంగా మీ విజువలైజేషన్ ఉండాలి.
-జీవితం పలు రంగాలకు సంబంధించిన విషయం. విజయం అనేది అన్ని రంగాలకు వర్తించాలి. అందుకే మీ లక్ష్యాల మధ్య బ్యాలెన్స్ చాలా అవసరం. ఒక వ్యక్తి గొప్ప గాయకుడు కావాలని అనుకుంటూనే, ఇంజినీరింగ్ చేయాలని కోరుకోవచ్చు. ఆ వ్యక్తికి సంబంధించినంత వరకు ఈ రెండు కోరికలు అత్యంత ప్రాణప్రదమైనవి. లక్ష్యాలను నిర్దేశించుకోవడంలో కూడా ఈ తులనాత్మకత దెబ్బతినకూడదు. ఇందుకు రాబర్ట్ డిల్ట్ ఒక కథను వివరిస్తాడు.
విజేతగా రెండు సాధనలు:
చైతన్య అనే బాలుడు పదోతరగతి చదువుతున్నాడు. అతడు చదువులో బాగా ముందడుగు వేస్తున్నట్లే.. టెన్నిస్ కూడా బాగా అడుతాడు. టెన్నిస్ చాంపియన్ కావాలని అతనికి ఎంతో ఆశగా ఉండేది. వ్యక్తిగతంగా అతని లక్ష్యం లాయర్ కావడం. అయితే ఈ రెండు విషయాల్లోనూ అతని మనోభావాలు, ఆలోచనలు బాగా వెనుకబడి ఉండేవి. టెన్నిస్ బాగా ఆడుతున్నప్పటికీ టోర్నమెంట్స్ మాట వినేసరికి చల్లబడిపోయేవాడు.
అలాగే లాయర్ కావడం అంత తేలికగా సాధ్యమయ్యే విషయం కాదని స్నేహితులతో అనేవాడు. ఈ రెండు లక్ష్యాలను కాగితంపై రాసుకున్నప్పుడు అతనికి చాలా థ్రిల్లింగ్‌గా అనిపించేది. కానీ వాటిని ఎలా సాధించాలో స్పష్టమైన అవగాహన మాత్రం అతనికి కలుగలేదు. ఈ నేపథ్యంలో రాబర్ట్ డిల్ట్ అనే ఎన్ఎల్పి శాస్త్రజ్ఞుడు అతనికి విజువలైజేషన్ టెక్నిక్ నేర్పించాడు. మొదట్లో బలహీనంగా ఉన్నప్పటికీ కొంత ప్రయత్నం చేసిన తర్వాత టెన్నిస్ ఆటగాడిగా తన ఇంద్రియానుభూతులను రాసుకోగలిగాడు. టోర్నమెంట్స్‌లో అద్భుతమైన విజయం సాధించినట్లు, ప్రశంసల వర్షం కురిసినట్లు, న్యూస్ పేపర్లన్నీ తన ప్రతిభను కొనియాడినట్లు, మిత్రులు కౌగిలించుకుని అభినందించినట్లు, ఆనాటి సాయంత్రం వాళ్లమ్మగారు మంచి డిన్నర్ ఏర్పాటు చేసినట్లు ఇలా పంచేంద్రియాలకు సంబంధించిన స్పందలను ఊహించుకోగలిగాడు. ఇలా ఉండగా కొన్నాళ్లకు చైతన్య రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్లాడు.
అక్కడొక కీలకమైన సంఘటన జరిగింది. ఓడిపోవాల్సిన దశలో అతగాడు హఠాత్తుగా విజృంభించాడు. ఊహింపనలవిగాని విజయాన్ని సాధించాడు. చాంపియన్ అయ్యాడు. ఆ రోజు తాను సాధించిన విజయం అతన్ని ఎంతగానో కలచివేసింది. అసలారోజు టోర్నమెంట్‌కు వెళ్తూనే అతనిలో వింతవింత భావనలు చెలరేగాయి. ఆ నగరానికి అంతకుముందే ఒకసారి వచ్చినట్లు, పాల్గొంటున్న క్రీడాకారుల్ని అంతకుముందే కలుసుకున్నట్లు అనిపించసాగింది. అక్కడున్న అధికారులతో మాట్లాడటం, వాళ్లు చెప్పే మాటలను, సలహాలను వినడం.. ఇవన్నీ అంతకుముందెప్పుడో తనకు ఎదురైన అనుభవాల మాదిరిగానే ఫీలయ్యాడు. ఇది సైకాలజీలో డెజావు అనుభవం లాంటిది. సాధారణ వ్యక్తులకు ఒక్కోసారి అంతకుముందెప్పుడూ వెళ్లి ఉండని నగరానికో, పట్టణానికో వెళ్లినప్పుడు.. ఆ ప్రదేశమంతా తమకు అంతకుముందు పరిచయం ఉన్నట్లుగా ఒక మానసిక అనుభవానికి గురవుతారు.
ఈ డెజావు ఎఫెక్ట్ చైతన్యకు విజువలైజేషన్ టెక్నిక్వల్ల ఏర్పడటం ఒక చక్కని అనుభవం. అతని మైండ్‌లో ఈ భావాలు వెల్లివిరిసి విజయం అనే ఊపిరి అతని గుండెలనిండా వ్యాపించింది. అతని మైండ్‌లో న్యూరాన్లను రెచ్చగొట్టింది. అతని నాడీవ్యవస్థ నిద్రపోయిన సింహంలా ఒక్కసారి లేచి జూలు విదిల్చింది. తత్ఫలితమే విజయం. ఈ విజయం అతను ఎన్నాళ్లనుంచో కంటున్న కల. దానికి సంబంధించిన పంచేంద్రియానుభవాలను, స్పందనలను ప్రతిక్షణం అనుభవిస్తూ, మదిలో రగిలిపోతూ ఎప్పుడు అవకాశం వస్తుందా? అని విజృంభిద్దాం అనే తపన మూలంగా వచ్చిన విజయం. విజువలైజేషన్ ప్రాముఖ్యత ఏంటో అతనికి బాగా అర్థమయ్యింది.
Read Today's Latest General News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

