HomeGeneralAyodhya Ram Mandir Timline For What Happen Since 1528 To 2024
Ayodhya | బాబ్రీ మసీదు నిర్మాణం నుంచి.. రామాలయ ప్రాణ ప్రతిష్ఠ వరకు.. అయోధ్యలో ఏ సంవత్సరం ఏం జరిగిందంటే..
హిందువులు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న మహోత్తర ఘట్టం సాక్షాత్కారం కాబోతున్నది. జనవరి 22వ తేదీన రామాలయంలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో బాబ్రీ మసీదు నిర్మాణం నుంచి రామాలయ నిర్మాణం పూర్తయ్యే వరకు జరిగిన కీలక ఘట్టాల గురించి ఒకసారి తెలుసుకుందాం..
2/16
1528
బాబ్రీ మసీదును మొఘల్ చక్రవర్తి కమాండర్ మీర్ బాకీ నిర్మించారు.
3/16
1885.. అయోధ్య రామ జన్మభూమి వ్యవహారం తొలిసారిగా కోర్టుకు చేరింది. బాబ్రీ మసీదు పక్కనే రామ మందిరాన్ని నిర్మించేందుకు అనుమతి ఇవ్వాలని ఫైజాబాద్ కోర్టులో మహంత్ రఘువర్‌దాస్ అప్పీల్ దాఖలు చేశారు.
4/16
1949.. వివాదాస్పద నిర్మాణంలోని మధ్య గోపురం కింద రామ్ లల్లా విగ్రహం కనిపించింది. దీంతో స్థానికులు అక్కడ పూజలు చేయడం మొదలుపెట్టారు.
5/16
1950.. రామ్‌లల్లా విగ్రహం బయటపడిన ప్రాంతంలో విగ్రహాలు ఉంచి.. పూజలు చేసేందుకు అనుమతించాలని పరమహంస రామచంద్ర దాస్ ఫైజాబాద్ కోర్టులో కేసు వేశారు.
6/16
1959.. వివాదాస్పద స్థలాన్ని స్వాధీనం చేసుకుసేందుకు నిర్మోహి అఖారా కోర్టు మెట్లు ఎక్కింది.
7/16
1981.. ఆ ప్రాంతం తమకు అప్పగించాలని యూపీలోని సున్నీ వక్ఫ్ బోర్డు కేసు వేసింది.
8/16
1986.. హిందువులు పూజలు చేసేందుకు ఈ స్థలాన్ని తెరవాలని ఫిబ్రవరి 1వ తేదీన స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
9/16
1989.. స్థానిక కోర్టు ఆదేశాలను కొనసాగించాలని అలహాబాద్ హైకోర్టు ఆగస్టు 14న తీర్పు ఇచ్చింది.
10/16
1992.. బాబ్రీ మసీద్‌ను డిసెంబర్ 6వ తేదీన కూల్చేశారు. ఈ ఘటనతో రామ మందిరం కోసం ఉద్యమం ఉధృతంగా మారింది.
11/16
2002.. వివాదాస్పద స్థలం యాజమాన్య హక్కుల అంశం అలహాబాద్ హైకోర్టుకు చేరింది. దీనిపై ఇదే సంవత్సరం ధర్మాసనం విచారణ ప్రారంభించింది.
12/16
2010.. వివాదాస్పద స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్ లల్లాకు మూడు సమాన భాగాలుగా విభజించాలని సెప్టెంబర్ 30వ తేదీన హైకోర్టు తీర్పు చెప్పింది.
13/16
2011.. వివాదాస్పద స్థలాన్ని మూడు సమాన భాగాలుగా పంచాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును మే 9వ తేదీన సుప్రీంకోర్టు నిలిపివేసింది.
14/16
2018.. వివాదాస్పద స్థలానికి సంబంధించిన సివిల్ అప్పీళ్లపై ఫిబ్రవరి 8వ తేదీన సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది.
15/16
2019.. ఈ ఏడాదిలో రామ జన్మభూమి వివాదం ఒక కొలిక్కి వచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటయ్యి.. రోజువారీ విచారణను ప్రారంభించింది. ఆగస్టు 6 నుంచి 16వ తేదీ వరకు విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. నవంబర్ 9న రామ జన్మభూమికి అనుకూలంగా తీర్పునిచ్చింది.
16/16
2.77 ఎకరాల వివాదాస్పద భూమిని రామాలయ నిర్మాణానికే కేటాయించాలని తెలిపింది. . మసీదు కోసం ప్రత్యేకంగా ఐదు ఎకరాల స్థలాన్ని వక్ఫ్ బోర్డుకు అందించాలని ఆదేశించింది. ఈ తీర్పు తర్వాతనే అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రారంభమైంది.
17/16
2024.. జనవరి 22వ తేదీన రామాలయంలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది.